గుంటూరు జిల్లాలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ శ్యామ్యూల్ ఆనంద్ కుమార్ మరిన్ని కఠిన నిర్ణయాలు ప్రకటించారు. ఇకపై గుంటూరులో రోజు విడిచి రోజు సంపూర్ణ లాక్ డౌన్ అమలవుతుందని తెలిపారు. ఒక్క షాపు కూడా తీసేది లేదని వెల్లడించారు. రెడ్ జోన్ల పరిధిలో ఉన్న వారు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు వెళ్లేందుకు అంగీకరించబోమని స్పష్టం చేశారు.
ప్రస్తుతం అనుమతిస్తున్న ఉదయం 6 నుంచి 9 వరకూ నిత్యావసరాల కొనుగోలు, ఇకపై రోజు విడిచి రోజు మాత్రమే అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోనున్నామని తెలిపారు. ఆదివారం రోజు కూడా పూర్తి లాక్ డౌన్ అమలవుతుందని, మెడికల్ షాపులు, ఆసుపత్రులకు మాత్రమే మినహాయింపు ఇస్తామని వెల్లడించారు. ప్రజలు తమ అవసరాలకు తగినట్టుగా 15 రోజులకు సరిపడా, మందులు, చిన్నారులకు పాల డబ్బాలు, నిత్యవసరాలు కొనుగోలు చేయాలని సూచించారు. కూరగాయలు రోజు మార్చి రోజు ఉదయం పూట కొనుగోలు చేయవచ్చని వెల్లడించారు.
జగన్ శ్రీరాముడో.. రావణుడో ప్రజలే తేల్చుకోవాలి: జేసీ దివాకర్‌రెడ్డి