telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

గుణ‌శేఖ‌ర్ దర్శకత్వంలో అద్భుతమైన ప్రేమకథ “శకుంతలం”

Shakuntalam

ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్ అంటే భారీ బడ్జెట్ చిత్రాలను, క‌ళ్లు చెదిరే సెట్స్‌తో అద్భుతంగా తెర‌కెక్కించే ఆయన ప్రతిభ కన్పిస్తుంది. గుణశేఖర్ తాజాగా తన తర్వాత చిత్రం ‘శకుంతలం’ అని ప్రకటించారు. గుణశేఖర్. తాజాగా ”శాకుంతలం” అనే సినిమా చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు గుణశేఖర్ . ”వెండితెరపై ‘హిరణ్యకశ్యప’ లోని నరసింహావతారాన్ని సాక్షాత్కరింపజేసే ముందు.. మహాభారతం ఆదిపర్వంలోని ఆహ్లాదకర ప్రేమకథను ఆవిష్కరిస్తున్నాను” అని ట్వీట్ చేసాడు గుణ శేఖర్. అంతేకాకుండా ”శాకుంతలం” మోషన్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశాడు. ‘మరచిపోయిన ప్రేమ.. మరచిపోలేని ప్రేమ కథ’ అని మోషన్ పోస్టర్ ద్వారా వెల్లడించారు.

ఈ పాన్ ఇండియా చిత్రాన్ని గుణ టీమ్ వర్క్స్ పతాకంపై గుణశేఖర్ కుమారై నీలిమ గుణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మెలొడీబ్రహ్మ మణిశర్మ సంగీతం అందిచనున్నారు. ఇకపోతే ఇందులో హీరో హీరోయిన్లుగా ఎవరు నటిస్తారు, షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది వంటి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. ఇక ఇది మహాభారతంలోని శకుంతల, దుష్యంతుల ప్రేమ కథ. ఒకనాడు వేట కోసం అడవికి వెళ్లిన దుష్యంత మహారాజు… కణ్వ మహర్షి పెంపుడు కుమార్తె శకుంతలను చూసి మనసుపడి మహర్షి అంగీకారంతో వివాహం చేసుకుంటాడు. శకుంతల విశ్వామిత్రుడు, మేనకల కుమారై. దుష్యంతుడితో ఆమె ప్రేమ, వారి గాంధర్వ వివాహం, కష్టాలు పడటం ఇలా అనేక అంశాలు శకుంతల ప్రేమ కథలో మిలిళితమై ఉంటాయి. కాగా నిజానికి గుణశేఖర్ రానాతో ‘హిరణ్యకశ్యప’ అనే చిత్రం చేయాల్సి ఉంది. ప్రీప్రొడక్షన్ వర్క్ సైతం కంప్లీట్ అయింది. కానీ లాక్ డౌన్ కారణంగా ప్రాజెక్ట్ టేకాఫ్ కావడానికి ఇంకా సమయం ఉండటంతో ఈలోపు ఒక సినిమా చేయాలనే ఉద్దేశ్యంతో ‘శకుంతలం’ సినిమాను అనౌన్స్ చేశారాయన.

Related posts