telugu navyamedia
ట్రెండింగ్ సాంకేతిక

జీశాట్‌ 31 ప్రయోగం .. విజయవంతం : ఇస్రో

SRO GSAT-7A From Dhawan Space Centre

ఇస్రో ఖాతాలో మరో విజయం వచ్చిచేరింది. తాజాగా చేసిన మరో ఉపగ్రహా ప్రయోగం విజయవంతంగా నింగిలోకి ప్రయోగించింది. ఫ్రెంచ్‌ గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ఈ తెల్లవారుజామున 2.31 గంటలకు, జీశాట్‌ 31 ప్రయోగం జరుగగా, ఏరియన్‌ స్పేస్‌ సంస్థకు చెందిన ఏరియన్‌ 5 రాకెట్‌ ద్వారా ఈ ఉపగ్రహం అంతరిక్షానికి చేరింది.

ఈ శాటిలైట్ 15 సంవత్సరాల పాటు కమ్యూనికేషన్‌ సేవలను అందించే పనిచేస్తుంది. జీశాట్ 31తో పాటే సౌదీకి చెందిన 1 హెల్లాస్‌ శాట్‌ 4 ఉపగ్రహాన్ని కూడా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టారు. జీశాట్ 31 బరువు 2,535 కిలోలు కాగా, అత్యంత సమర్వంతమైన కేయూ బ్యాండ్‌ ప్రసార వ్యవస్థను ఇది కలిగివుంటుంది.

భారత భూభాగం, ద్వీపాలు, అరేబియా సముద్రం, బంగాళాఖాతం పరిసరాల సమాచారాన్ని ఇది అందించనుంది. ఇదే సమయంలో వీశాట్‌ నెట్‌ వర్క్స్‌, టెలివిజన్‌ అప్‌ లింక్స్‌, డిజిటల్‌ శాటిలైట్‌, డీటీహెచ్‌, సెల్యులార్‌ బ్యాకప్‌ తదితరాలకు అనుకూలమైన సాంకేతికత ఇందులో ఉందని ఇస్రో తెలిపింది.

Related posts