జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఈరోజు మధ్యాహ్నం శ్రీనగర్ లోని మౌలానా ఆజాద్ రోడ్ లోని మార్కెట్ లో గ్రనేడ్ దాడి జరిపారు. ఈ దాడిలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోగా, 15మందికి గాయపడ్డారని పోలీసులు తెలిపారు. గత 15రోజుల వ్యవధిలోనే ఉగ్రవాదులు రెండుసార్లు గ్రనేడ్లతో దాడి చేశారు.
అక్టోబర్ 28న నార్త్ కశ్మీర్ లో సోపోర్ ప్రాంతంలో ఉగ్రవాదులు జరిపిన గ్రనేడ్ దాడిలో 19మంది క్షతగాత్రులయ్యారు. పీవోకేలోని ఉగ్ర శిబిరాలపై భారత సైన్యం దాడులు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో ఉగ్రమూకలు కశ్మీర్ లో భయాందోళనలు సృష్టించేందుకు, గ్రనేడ్లతో దాడులకు పాల్పడతున్నాయని సైనిక వర్గాలు అంటున్నాయి.