telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

నేడు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖుల శుభాకాంక్షలు తెలిపారు

మనం ప్రతి యేటా ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకొంటాము.

తెలుగు కవి గిడుగు వేంకట రామమూర్తి జయంతి నేడు. తెలుగు భాషకు ఆయన చేసిన సేవలను గౌరవించి, ఆయన జయంతి నాడు తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటాము.

తెలుగు భాషా దినోత్సవం రాజకీయ ప్రముఖులంతా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఏపీ సీఎం చంద్రబాబు దేశ, విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

తెలుగు భాషాభివృద్ధికి విశేషంగా కృషి చేసిన మహనీయులను నేడు తలచుకోవడం ద్వారా అమ్మ భాషకు సేవ చేసిన తెలుగు పెద్దలకు కృతజ్ఞతలు చెబుదామని ట్విటర్ వేదికగా చంద్రబాబు తెలిపారు.

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సైతం తెలుగు భాషా దినోత్సవంపై స్పందించారు. తెలుగు భాష తీయదనాన్ని భావి తరాలకు అందిద్దామన్నారు. దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు కీర్తించిన మన అమ్మ భాషను గౌరవించుకొందామన్నారు.

నవ తరానికి తెలుగు గొప్పదనాన్ని తెలియచేద్దామన్నారు. గ్రాంథికంలో ఉన్న తెలుగును వాడుక భాషకు తీసుకువచ్చి రచనలు చేయడం వల్లే భాషా సౌందర్యం ఇనుమడించిందని పవన్ అన్నారు.

ఇందుకు వ్యావహారిక భాషోద్యమ మూల పురుషుడు గిడుగు వెంకట రామమూర్తి చేసిన కృషి చిరస్మరణీయమన్నారు.

తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు.

తెలుగు వాడుక భాషలో రచనలు ఉండాలని జీవితాంతం ఉద్యమించిన వ్యవహారిక భాషా పితామహుడు గిడుగు రామమూర్తి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా నిర్వహించుకోవడం, ఆ మహనీయుని కృషిని సమర్థించుకునే అవకాశం తెలుగువారిగా మనకు దక్కిందన్నారు.

తన కుమారుడు దేవాన్ష్కి ప్రత్యేకంగా తెలుగు మాట్లాడటమే కాదు.. చదవటం, రాయటం కూడా నేర్పిస్తున్నానని లోకేష్ తెలిపారు.

 

Related posts