greencard seekers are max indians

అమెరికాలో గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న వారిలో 3/4 వంతు భారతీయులే

30

ఒక ఆర్థిక సంవత్సరంలో 7 శాతానికి మించి గ్రీన్ కార్డులు ఇతర ఏ స్వతంత్ర దేశీయులకైనా జారీ చేసేది లేదని అమెరికా నిర్ణయించింది. న్యాయపరమైన శాశ్వత నివాస యోగ్యతను యునైటెడ్ స్టేట్స్ లో పొందాలంటే గ్రీన్ కార్డు ఉండాల్సిందే అన్న విషయం మనకు బాగా తెలిసిందే. ఆ గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న వాళ్లలో అధికం గా భారతీయులే ఉన్నారని అమెరికా అధికారికంగా తెలిపింది.

చాలా కాలంగా ఎదురుచూస్తున్న వారిలో 3/4వంతు భారతీయులేనంట, మే 2018 వరకు ఉద్యోగ పరమైన విధంగా ఎదురుచూస్తున్న అన్యదేశస్థులలో 39,50,025 మంది ఉండగా అందులో 30,06,061 మంది భారతీయులే అని యునైటెడ్ సిటిజెన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీస్ లెక్కలు చెబుతున్నాయి.

ఇండియన్-అమెరికన్ ఎవరైతే ముఖ్యం గా అమెరికాకి హెచ్ 1 బి కోసం వెళ్తున్నారు, వారికీ ఇప్పుడున్న ఇమ్మిగ్రేషన్ సిస్టం అమెరికా విధించిన 7 శాతం కోటా గ్రీన్ కార్డు కి శాశ్వత నివాసానికి సమస్యగా మారింది, ఇప్పుడొచ్చిన నిబంధనల ప్రకారం భారతీయులు గ్రీన్సార్డ్ కోసం ఎదురుచూస్తున్న వారందరికీ రావడానికి 70 సంవత్సరాలు పట్టొచ్చు, ఈ గ్రీన్సార్డ్ ని శాశ్వత నివాస పత్రం గా భావించవచ్చు. ఇది ఉంటే అమెరికాలో న్యాయపరంగా ఉద్యోగం చేస్తూ నివసించవచ్చు, అమెరికా పౌరసత్వానికి గ్రీన్ కార్డు తోలి అడుగు అని చెప్పవచ్చు.