great response on govt block money add

నల్లధనం పై ప్రకటనకు…! అనూహ్య స్పందన…

240

ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పథకానికి మంచి రెస్పాన్సులొస్తున్నాయి. బినామీ లావాదేవీలు లేదా ఆదాయానికి మించిన ఆస్తికి సంబంధించిన నిర్దిష్టమైన సమాచారాన్ని ఆదాయపు పన్ను శాఖకు తెలిపితే, పన్ను సమాచార వ్యవస్థ వారికి కోటి రూపాయల మేర రివార్డులను అందజేస్తామనే ప్రకటనకు విరివిగా భారీ ఎత్తులో స్పందన లభిస్తుందని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. విదేశాలలో ఉన్న నల్లధనం గురుంచి సంపూర్ణ సమాచారం అందించిన వారికీ సుమారు 5కోట్ల నజరానా అందిస్తామని కూడా ప్రకటించారు.

జూన్ 1న, నల్లధనం వెలికితీత కోసం చేసిన ఈ ప్రకటనకు అతి తక్కువ కాలంలోనే ప్రజలనుంచి మంచి స్పందన రావడం ఆశ్చర్యపరుస్తుంది. పిర్యాదులు ఎక్కువగా ఈమెయిల్, పోస్టు ల ద్వారా చేరుతున్నాయి, ఈ స్కీమ్ ప్రకటించిన మరుసటి రోజు నుండే ఆదాయపు పన్ను శాఖకు ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. వచ్చిన ఈమెయిల్స్ ను, ఉత్తరాలను పరిశీలుస్తున్నామని కమిషనర్ స్థాయి అదికారులు తెలుపుతున్నారు. అలాగే మొదటి రోజునుంచే శాఖకు సంబందించిన ఇన్ఫార్మర్లు భారీగా పిర్యాదులు చేస్తున్నారని, గత వారమే వారికీ ఇచ్చే పారితోషికం సమీక్ష జరిగిందని అధికారికంగా తెలిపారు. అయితే భారీ ఎత్తున వచ్చిన ఈ ఫిర్యాదుల్లో ఎక్కువగా రాజకీయ నేతలు, వ్యాపారాలు ఉన్నట్లు తెలుస్తుంది.

good-response-to-IT-Departm

ఈ వారంలో దాదాపు 500 కి పైగా ఫోన్ కాల్స్ వచ్చాయని, వాటిలో కొంతమేరకు అనవసరమైన కాల్స్ కూడా వచ్చాయని, వచ్చిన ఉత్తరాలలో పరిశీలించిన వాటిలో 15శాతం అవసరం లేనివిగా సీబీడీటీ అధికారులు గుర్తించారు. సమాచారం వచ్చిన వివరాలను సంబంధిత అధికారులు పరిశీలించి వాటిని విచారణ విభాగానికి ఫార్వార్డ్ చేస్తామని తెలిపారు. ఇప్పటికి వచ్చిన ఫిర్యాదులలో కొన్ని ఒకటి రెండు పేజీల సమాచారం ఉండగా కొన్ని దాదాపు 450, 500 పేజీలవరకు ఉందన్నారు, ఇలా అత్యధిక ఫోన్లు, ఇమెయిల్ లు, మరియు ఉత్తరాలు ఆదాయపు పన్నుల శాఖకు కాస్త తలనొప్పి తెప్పించినప్పటికీ కొందరి నుండి కీలక సమాచారం లభిస్తుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

income-tax-enquiry

వచ్చిన ఫిర్యాదులను శ్రీగ్రంగా పరిశీలించి విచారణ కోసం కోర్టుకు సమర్పిస్తామని, అలాగే పిర్యాదులు పంపిన వ్యక్తి వివరాలు గోప్యంగా ఉంటాయని సమాచారం ఇచ్చిన వారికీ ఎలాంటి హాని జరగదని హామీ ఇచ్చారు. ఏదేమైనప్పటికీ వచ్చిన ఫిర్యాదులతో పూర్తి విచారణ జరిపితే దేశంలోని నల్లధనాన్ని 70శాతం వరకు వెనక్కి తీసుకు రావచ్చని అధికారులు తెలుపుతున్నారు. దీనితో నల్లధనం దాచుకున్నవారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

మరికొంత మంది మాత్రం, వివరాలను గోప్యాంగ ఉంచగలరో లేదో, నజరానా సమయంలో వివరాలేమైనా బయటపడుతాయేమోనని సమాచారం ఇవ్వడానికి పలువురు భయపడుతున్నారు. మంచి స్పందన వచినప్పటికి ప్రభుత్వం ప్రకటించిన విధంగా నజరానాలు పూర్తి మొత్తంలో అందుతాయో లేదో అనే ప్రశ్న కూడా పలువురిలో మొదలయ్యింది.