telugu navyamedia
సినిమా వార్తలు

అవతార్ ఆఫర్ ను తిరస్కరించిన బాలీవుడ్ హీరో

Govinda

ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ వెండి తెరపై సృష్టించిన అద్భుతం “అవ‌తార్”. 2009లో సామ్ వార్తింగ్టన్, జోయే సల్దనాతోపాటు పలువురు హాలీవుడ్ స్టార్స్ కీలక పాత్రల్లో వచ్చిన అవతార్ అత్యధిక గ్రాస్ సాధించిన సినిమాగా రికార్డులు సాధించింది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరినీ కొత్త లోకంలోకి “అవతార్” సినిమా సీక్వెల్స్ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘అవతార్‌ 2, అవతార్‌ 3, అవతార్ 4, అవ‌తార్ 5’ చిత్రాల‌ని ప్రేక్ష‌కుల ముందుకు తేవాల‌నుకున్న కామెరూన్ ప్ర‌స్తుతం అవతార్‌ 2, అవతార్ 3 చిత్రాల‌కి సంబంధించి షూటింగ్ జ‌రుపుతున్నాడు. అవతార్ 2 చిత్రం డిసెంబ‌ర్ 17,2021న విడుద‌ల కానుంది. బాలీవుడ్ స్టార్ గోవిందాకి అవ‌తార్ చిత్రంలో న‌టించే ఛాన్స్ వ‌చ్చిన‌ప్ప‌టికి , ఆయ‌న తిర‌స్కరించాడ‌ట‌. ఈ విష‌యాన్ని తాజా ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించాడు గోవిందా. చిత్రం కోసం 410 రోజు కాల్షీట్స్ కేటాయించ‌డంతో పాటు షూటింగ్ జ‌రిగే అన్ని రోజులు బాడీ అంతా బ్లూ పెయింట్ వేసుకోవాల‌ని కామెరూన్ చెప్పార‌ట‌. ఇందుకు ఆయ‌న సున్నితంగా క్ష‌మాప‌ణ‌లు చెబుతూ ఆఫ‌ర్‌ని తిర‌స్క‌రించిన‌ట్టు గోవిందా పేర్కొన్నారు. అయితే చిత్రానికి అవ‌తార్ అనే టైటిల్ పెట్టాల‌ని కామెరూన్ కి తానే సూచించిన‌ట్టు పేర్కొన్నాడు గోవిందా.

Related posts