telugu navyamedia
తెలంగాణ వార్తలు

ఖైరతాబాద్‌ గణేశునికి గవర్నర్‌ తమిళసై తొలిపూజ

తెలుగు రాష్ట్రాల్లో వినాయకచవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కొవిడ్‌ నిబంధనల మేరకు ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని ప్రఖ్యాత ఖైరతాబాద్‌ గణనాథుడిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈసారి అక్కడ 40 అడుగులతో ‘పంచముఖ రుద్ర మహాగణపతి’ని ప్రతిష్ఠించారు. ఖైరతాబాద్‌ గణేశునికి గవర్నర్‌ తమిళసై తొలిపూజ నిర్వహించారు. తొలిపూజ కార్యక్రమంలో హర్యానా గవర్నర్‌ దత్తాత్రేయ పాల్గొన్నారు.

శ్రీ పంచముఖ రుద్ర మహాగణపతిగా ఖైరతాబాద్‌ మహా గణపతి భక్తులకు దర్శనమిస్తున్నారు. 40 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన విగ్రహం వద్ద కుడి వైపు కృష్ణకాళి అమ్మవారు, ఎడమవైపు కాల నాగేశ్వరి అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి. మహాగణపతి 36 అడుగులు ఎత్తు ఉండగా, తలపై ఉన్న సర్పంతో కలుపుకొని 40 అడుగుల ఎత్తు ఉంటుంది. ఖైరతాబాద్‌ మార్గంలో ఈ నెల 19 వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఈ మార్గంలో భక్తులకు మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చారు.

Related posts