telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

విద్యార్థులకు శుభవార్త… 1 నుంచి 8వ తరగతి వరకు పరీక్షలు రద్దు

students

దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. తాజా కేసులతో దేశంలో 1.23 కోట్లు దాటాయి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య. గడచిన 24 గంటలలో 89,129 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా… కరోనా వల్ల మొత్తం 714 మంది మృతి చెందారు. మహరాష్ట్రలోనూ రోజుకు 45 వేలకు పైగా కరోనా కేసులొస్తున్నాయి. అటు ఇప్పటికే మహరాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ కూడా ప్రకటించారు. మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 1 నుంచి 8 వ తరగతి విద్యార్థులను పరీక్షలు రాయకుండానే పై తరగతులకు పంపించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మహారాష్ట్ర విద్యాశాఖ మంంత్రి వర్షా ఓ ప్రకటనలో రిలీజ్‌ చేశారు. అదే విధంగా 9-11 వ తరగతి విద్యార్థుల అంశంలోనూ త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

Related posts