telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు

గూగుల్ పే, ఫోన్ పే యూజర్లకు గుడ్ న్యూస్

Gpay

మీరు గూగుల్ పే ఉపయోగిస్తున్నారా? లేదంటే ఫోన్ పే వాడుతున్నారా? అయితే మీకు తీపికబురు. గూగుల్ పే, ఫోన్ పే యూజర్లకు కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ)తో ఈ రెండు కంపెనీలు రికరింగ్ పేమెంట్ మ్యాండేట్స్ అంశంపై చర్చిస్తు్న్నాయి. ఎన్‌పీసీఐ జూలై 22న రికరింగ్ పేమెంట్స్ ఫెసిలిటీని అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఎన్‌పీసీఐతో ఈ ఇరు కంపెనీల చర్చలు ఫలప్రదమైతే యూజర్లకు ప్రయోజనం కలుగనుంది. దీంతో ఫోన్ పే, గూగుల్ పే యూజర్లు ఆటో డెబిట్ సదుపాయాన్ని పొందొచ్చు. అంటే నెలవారీ బిల్లులను సులభంగానే చెల్లించొచ్చు. ఆటోమేటిక్‌గా అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతాయి. కరెంటు బిల్లు, మొబైల్ ఫోన్ బిల్లు, ఈఎంఐలు, మీడియా సబ్‌స్క్రిప్షన్స్, ఇన్సూరెన్స్ ప్రీమియం ఇలా ఎన్నో రకాల చెల్లింపులు ఆటోమేటిక్‌గా పూర్తవుతాయి. వీటి గురించి ఆలోచించాల్సిన పనిలేదు. ఆటో డెబిట్ ఫీచర్ యాక్టివేట్ చేసుకోవచ్చు. ‘గూగుల్ పే, ఫోన్ పే కంపెనీలు రికరింగ్ పేమెంట్స్ ప్లాట్‌పామ్‌పై పని చేస్తున్నాయి. నెల రోజుల్లో లేదంటే ఇంకా ముందుగానే ఈ సర్వీసులు యూజర్లకు అందుబాటులోకి రావొచ్చు’ అని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ అంశంపై అటు గూగుల్ పే కానీ ఇటు ఫోన్ పే కానీ స్పందించలేదు.

Related posts