telugu navyamedia
సినిమా వార్తలు

ప్రభాస్ అభిమానులకు శుభవార్త 

prabhas
“బాహుబలి” చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ స్టార్ హీరో, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ప్రస్తుతం మరో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “సాహో” చిత్రంతో ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఆ తరువాత దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ ప్రేమ కథకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఒకవైపు సాహో షూటింగ్, మరోవైపు రాధాకృష్ణ సినిమా షూటింగులో పాల్గొంటూ చాల బిజీగా గా ఉన్నాడు ప్రభాస్.
ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న “సాహో” సినిమా ఈ సంవత్సరం ఆగస్టులో విడుదలవుతుంది. ఇక ఇదే సంవత్సరం చివర్లో రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెెక్కుతున్న చిత్రం కూడా విడుదల కానుందట. ఇంతకుముందు రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రాన్ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరిలో విడుదల చేయాలని భావించారు. కానీ “సాహో” పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉండగానే, రాధాకృష్ణ సినిమాకు ప్రభాస్ డేట్లను కేటాయించడంతో అనుకున్న టైంకన్నా ముందుగానే ఈ చిత్రం షూటింగ్ పూర్తి అవుతుందట. దీంతో “సాహో” విడుదలైన నాలుగు నెలల్లోపే ప్రభాస్ మరో సినిమా కూడా రానుంది. ఈ విషయం తెలుసుకున్న ప్రభాస్ అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు. 

Related posts