ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలతో దూసుకుపోతున్న జగన్ ప్రభుత్వం మరో ఘట్టానికి నాంది పలికింది. కేంద్ర ప్రభుత్వ పఢ్నా-లిక్నా అభియోన్ పథకాన్ని రాష్ట్రంలో అమలుకు ఉత్తర్వులు జారీ చేసింది జగన్ ప్రభుత్వం. జిల్లా, మండల, పట్టణ స్థాయిల్లో కమిటీలు వేసుకుని పథకం అమలును పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేసింది. 15 ఏళ్లు దాటిన వయోజనులైన నిరక్షరాస్యులను గుర్తించి.. చదువు చెప్పేలా ప్రణాళికలు సిద్దం చేయాలని ఆదేశాలు జారీ చేసింది జగన్ ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా 3.20 లక్షల నిరక్షరాస్యులకు చదువు చెప్పేలా ప్రణాళికలు సిద్దం చేస్తోంది ఏపీ ప్రభుత్వం.
previous post