telugu navyamedia
తెలంగాణ వార్తలు

మద్యం షాపు ఓన‌ర్ల‌కు గుడ్‌న్యూస్..

తెలంగాణ‌లో మ‌ద్యం షాపుల యాజ‌మ‌న్యాల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. 2019 -21 సంవత్సరానికి రాష్ట్రంలో రిటైల్ మద్యం షాపుల లైసెన్సులను మరో నెల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కరోనా కారణంగా దాదాపు 45రోజుల పాటు షాపులు మూతపడటంతో తీవ్రంగా నష్టపోయామని, త‌మ‌ను ఆదుకోవాల‌ని మ‌ద్యం షాపుల ఓనర్లు చేసిన విన‌తిపై ప్ర‌భుత్వం సానుకూలంగా స్పందించింది.

ఈ మేరకు ప్రభుత్వం లైసెన్స్ గడువు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని ఏ-4 రిటైల్ షాపుల లైసెన్సులను ఈ ఏడాది నవంబర్ 1వ తేదీ నుంచి ఆ నెల చివరి తేదీ వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

మద్యం కిక్‌కు తెలంగాణ సర్కార్ బ్రేక్..!! | Trs government strong warning to wine  shop owners | TV9 Telugu

అయితే.. లిక్కర్‌ షాపుల కేటాయింపులోనూ రిజర్వేషన్లు వర్తింపజేయాలని  మద్యం షాపుల్లో గౌడ కులస్థులకు 15 శాతం, షెడ్యూల్డ్‌ కులాలకు 10 శాతం, షెడ్యూల్డ్‌ తెగలకు 5 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కేసీఆర్‌ సర్కార్..

కాగా .. సెప్టెంబ‌ర్ నెలాఖ‌రు వరకు బార్ల లైసెన్సుల గడువు ముగియనుండగా.. నెలరోజుల పొడిగింపుతో అక్టోబర్‌ 31 వరకు కొనసాగనున్నాయి. న‌వంబ‌ర్ నుండి కొత్త లైసెన్సుల జారీ కోసం ప్ర‌క్రియ‌ను త్వ‌ర‌లో ప్రారంభించ‌బోతున్నారు.

Related posts