telugu navyamedia
తెలంగాణ వార్తలు

ఇంట‌ర్ విద్యార్థుల‌కు శుభ‌వార్త‌

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ఇంట‌ర్ విద్యార్థుల‌కు ఒక శుభ‌వార్త చెప్పింది. ఈనెల 25 నుంచి నిర్వ‌హించే ఇంట‌ర్మీడియ‌ట్ మొద‌టి సంవ‌త్స‌రం ప‌రీక్ష‌ల‌లో కేవ‌లం 70శాతం మాత్ర‌మే సిల‌బ‌స్ నుంచి ప్ర‌శ్న‌లు వ‌స్తాయ‌ని ఇంట‌ర్‌బోర్డు కార్య‌ద‌ర్శి జ‌లీల్ తెలిపారు. ప్ర‌శ్న‌ల్లో మ‌రిన్ని చాయిస్‌ల‌ను కూడ పెంచిన‌ట్టు
పేర్కొన్నారు. అందులో 50 శాతం చాయిస్ ఉంటుంద‌ని వెల్ల‌డించారు. ఇందుకు సంబంధించిన స్ట‌డీ మెటీరీయ‌ల్‌ను రాష్ట్ర విద్యాశాఖ‌మంత్రి స‌బితాఇంద్రారెడ్డి విడుద‌ల చేశారు. విద్యార్థుల కెరీర్‌, ప్ర‌యోజ‌నాల కోసం ఈ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నామ‌ని వివ‌రించారు.

ల‌క్ష‌లాది మంది విద్యార్థుల‌కు ప్ర‌భుత్వం త‌యారు చేసిన స్ట‌డీ మెటీరియ‌ల్ ఎంతో ఉప‌యోగ‌ప‌డుతోంద‌ని మంత్రి వెల్ల‌డించారు. త‌మ వెబ్‌సైట్‌లో కూడా ఈ మెటీరియ‌ల్ అందుబాటులో ఉంటుంద‌ని వివ‌రించారు. అనుభ‌వ‌జ్ఞులైన సీనియ‌ర్ అధ్యాప‌కుల‌చే మెటీరియ‌ల్ త‌యారు చేయించిన‌ట్టు చెప్పారు మంత్రి స‌బితా. ఇంట‌ర్ మొద‌టి సంవ‌త్స‌రం ప్రాథ‌మిక లెర్నింగ్ మెటీరియ‌ల్ కోసం tsbie.cgg.gov.in వెబ్‌సైట్‌లో సంప్ర‌దించ‌వ‌చ్చు.

Related posts