telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు

గుడ్ న్యూస్ : తగ్గిన బంగారం ధరలు

ఇండియాలో బంగారానికి ఉన్న డిమాండ్‌ మరేదానికి లేదు. ఎందుకంటే మనదేశంలో మహిళలు ఎక్కువగా బంగారం కొనడానికే ఇష్టపడతారు. కానీ మన దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. కరోనా టైంలో బంగారం ధరలు ఆమాంతం తగ్గాయి. అయితే… బులియన్‌ మార్కెట్‌లో వారం రోజులుగా పెరిగిన బంగారం ధరలు తాజాగా మళ్లీ తగ్గాయి. హైదరాబాద్ విషయానికి వస్తే.. బంగారం ధరలు ఇవాళ తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 210 తగ్గి రూ. 48,560 కు చేరగా… అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 తగ్గి రూ. 44,500 పలుకుతోంది. బంగారం ధరలు తగ్గగా.. వెండి ధరలు కూడా తగ్గాయి. కిలో వెండి ధర రూ. 100 తగ్గి రూ.75,900 వద్ద కొనసాగుతోంది.

Related posts