ప్రపంచంలోనే అతి విలువైన వస్తువు బంగారం. దీనిని కొనడానికి ఎంతో ఇష్టపడతారు మహిళలు. ధర ఎంత ఉన్నప్పటికీ బంగారం కొనేందుకే ఆసక్తి చూపుతారు. అయితే.. తాజాగా బంగారం ధరలు భారీగా పడిపోయాయి. గత మూడు రోజులు తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఇవాళ మాత్రం కాస్త పెరిగాయి. ఈరోజు ఢిల్లీలో, హైదరాబాద్ లో మాత్రం బంగారం ధరలు కాస్త పెరిగాయి. ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 280 పెరిగి రూ. 47,840 పలుకుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 250 తగ్గి రూ. 43,850 పలుకుతోంది. హైదరాబాద్ విషయానికి వస్తే.. బంగారం ధరలు కాస్త పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 270 పెరిగి రూ. 45,490 కు చేరగా… అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 250 పెరిగి రూ. 41,700 పలుకుతోంది. బంగారం ధరతో పాటు వెండి ధరలు కూడా పెరిగాయి. ఈరోజు కిలో వెండి ధర రూ. 200 పెరిగి 70,100గా నమోదైంది.
previous post
next post
వైఎస్ నైజమే జగన్ లో కనిపించింది: ఉండవల్లి