telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

గోవాకు ఎవరు వచ్చినా 14 రోజులు క్వారంటైన్ లో ఉండాల్సిందే!

Goa beach

లాక్ డౌన్ నేపథ్యంలో గోవా బీచులు బోసిపోయి కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కీలక ప్రకటన చేశారు.గోవాలో కొత్తగా కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో, మడగావ్ రైల్వే స్టేషన్ లో స్పెషల్ ట్రైన్లు ఆగవని ఆయన చెప్పారు. వివిధ మార్గాల ద్వారా గోవాకు చేరుకునే వారు కచ్చితంగా 14 రోజుల పాటు హోమ్ క్వారంటైన్ లో ఉండాల్సిందేనని తెలిపారు.రాష్ట్రానికి వచ్చే వారు గోవా ప్రజలు కాకున్నా క్వారంటైన్ కు వెళ్లాల్సిందేనని చెప్పారు.

వాస్తవానికి ఢిల్లీ నుంచి తిరువనంతపురం వెళ్లే ప్రత్యేక రైలు మడగావ్ రైల్వే స్టేషన్ లో ఆగాల్సి ఉంది. అయితే, ఇక్కడ రైలును ఆపొద్దని రైల్వే శాఖకు నిన్న ముఖ్యమంత్రి విన్నవించారు. 720 మంది ప్రజలు మడగావ్ లో దిగేందుకు టికెట్లను బుక్ చేసుకున్నారని.. అయితే వీరిలో ఏ ఒక్కరు కూడా గోవా వ్యక్తి కాదనే విషయం తమకు తెలిసిందని చెప్పారు.వీరంతా గోవాలో అడుగుపెడితే తమ పరిస్థితి ఏమిటనే ఆందోళన తమలో ఉందని ముఖ్యమంత్రి అన్నారు. వారందరినీ టెస్ట్ చేయాలని, హోమ్ క్వారంటైన్ కు పంపించాలని సూచించారు.

Related posts