telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఇలియానా బికినీ ట్రీట్… వీడియో వైరల్

Ileana

గోవా బ్యూటీ ఇలియానా విదేశీ ఫోటోగ్రాఫ‌ర్ ఆండ్రూ నీబోన్‌తో ప్రేమాయ‌ణం న‌డిపిన ఇలియానా అప్ప‌ట్లో సీక్రెట్‌గా వివాహం చేసుకుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఇటీవలే ఇల్లి బేబీ ఆండ్రూ ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాల నుంచి డిలీట్ చేయడంతో వీరిద్దరి మధ్య బ్రేకప్ జరిగిందనే వార్తలు హల్చల్ చేశాయి. ఇక చాలా గ్యాప్ ఈ అమ్మడు త‌ర్వాత “అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని” చిత్రంతో తెలుగులోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా కొట్ట‌డంతో తెలుగు సినిమా ఆఫ‌ర్స్ ఈ బ్యూటీకి కరువ‌య్యాయి. అయితే “అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని” చిత్రంలో చాలా లావుగా క‌నిపించిన ఇలియానా ప్ర‌స్తుతం స్లిమ్ లుక్‌లో ద‌ర్శ‌న‌మిస్తుంది. మళ్లీ తన పాత ఫిజిక్‌ను తీసుకొచ్చింది. ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ హాట్ ఫొటోలు పెడుతూ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. కాగా… గోవా బ్యూటీ ఇలియానా పుట్టినరోజు నేడు. ఈరోజు (నవంబర్ 1న) ఆమె 33వ ఏట అడుగుపెట్టారు. అయితే, ఆమె సెలబ్రేషన్స్ నిన్నటి నుంచే మొదలైపోయాయి. గురువారం హాలీవీన్ డేను పురష్కరించుకుని భయంకరమైన మేకప్‌లో దర్శనమిచ్చారు ఇలియానా. కళ్లనిండా కాటుక పూసుకుని నల్లటి దుస్తులు ధరించి దెయ్యంలా కనిపించారు. అయితే ఈ మేకప్ అంతా ఆమె హీరోయిన్‌గా నటించిన ‘పాగల్‌పంతి’ సినిమా కోసం. ‘పాగల్‌పంతి’ పోస్టర్‌లో భయంకరంగా కనిపించిన ఇలియానా ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రం ఫ్యాన్స్‌ను పిచ్చెక్కించారు. తన బర్త్‌డేకు ఒక్కరోజు ముందు ట్రీట్ ఇచ్చారు. ట్రీట్ అంటే అలాంటి ఇలాంటి ట్రీట్ కాదు.. గ్లామర్ ట్రీట్. బికినీలో సన్ బాత్ చేస్తూ ఒక చిన్న సెల్ఫీ వీడియో తీసుకుని ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టారు. ఈ బికినీలో ఇలియానా పిచ్చ హాట్‌గా ఉన్నారు. ఆమె ఒంటిపై నీలం రంగు బికినీ మెరిసిపోతోంది. ఈ పోస్ట్‌కు ఇప్పటికే 1.8 మిలియన్ లైకులు వచ్చాయి.

Related posts