telugu navyamedia
సినిమా వార్తలు

చిత్రలహరి : “గ్లాస్ మేట్స్” వీడియో మేకింగ్ సాంగ్

Chitralahari

కిషోర్ తిరుమల దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన చిత్రం “చిత్రలహరి”. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. ఈ చిత్రంలో సాయి తేజ్ సరసన కళ్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా నటించారు. సునీల్, వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో కన్పించారు. దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం సినిమాకు హైలెట్ గా నిలిచింది. వరుస ఫ్లాపులతో నిరాశ చెందిన సాయి తేజ్ కు ఈ సినిమా కొంత ఊరటనిచ్చింది. తాజాగా ఈ చిత్రంలోని ‘‘గ్లాస్ మేట్స్’’ సాంగ్ మేకింగ్ వీడియోను విడుదల చేశారు. ఇందులో సాంగ్ షూటింగ్ చేస్తున్నప్పటి పలు ఆసక్తికర సన్నివేశాలను, సాంగ్ మేకింగ్ సందర్భంలో తీసుకున్న జాగ్రత్తలను సాయిధరమ్ తేజ్, కిషోర్ తిరుమల, సునీల్ వివరించారు. సినిమా విడుదలకు ముందు నుంచే ఈ సాంగ్‌కి భారీగా ప్రేక్షకాదరణ వచ్చింది. మీరు కూడా ఈ మేకింగ్ వీడియోను వీక్షించండి.

Related posts