girl-child-tossed-in-up-street

రోడ్డున పడ్డ పసికందు…

102

సమాజంలో ఆడపిల్లల పట్ల వివక్ష కొనసాగుతూనే ఉంది, పసికందు అనే కనికరం రాను రాను కనుమరుగవుతుంది. ఉత్తర ప్రదేశ్ లోని ముజాఫర్ నగర్ లో జరిగిన ఈ ఘటన సంచలనాత్మకంగా మారింది. వివరాల ప్రకారం ఉత్తర ప్రదేశ్ లో అప్పుడే పుట్టిన నవజాత శిశువును ఒక వీధిలో కనికరం లేకుండా వదిలేసి వెళ్లిపోయారు, కార్లో వచ్చిన కొందరు దుండగులు చిన్నారిని ఒక ఇంటి ముందు మెట్లపై వదిలిపెట్టిన వారి వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. సీసీ ఫుటేజికి చిక్కిన ఈ వీడియోలో ఇరుకుగా ఉన్న ఒక గల్లీలో చిన్నారిని వదిలేసి పోవడం స్థానికులకు కలకలం లేపుతుంది, చిన్నారి కేకలు విన్న స్థానికులు చికిత్స నిమిత్సం ఆసుపత్రికి తరలించారు, పాప పరిస్థితి చాలా విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వైద్య పరీక్షల అనంతరం పోలీసుల ఆదీనంలో అనాధాశ్రమంలో చేర్చడమో లేదా తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి తిరిగి వారికీ అప్పజెప్పడమో అనాదిగా వస్తున్నదే, కానీ సమాజంలో మార్పు రావడానికి అధికారులు ఇలాంటి సంఘటనలపై కఠిన శిక్షలు విధించాలని ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రతి తల్లిదండ్రులకి గర్భిణిగా ఉన్నప్పుడే కౌన్సిలింగ్ ఇచ్చి ఇలా చేసే వారిలో మార్పు తీసుకురావాలని పలువురు కోరుకుంటున్నారు.

సమాజంలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతుంది, పుట్టినప్పటి నుంచి చనిపోయేంతవరకు ఎదో ఒక రకంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు పిల్లలు లేక అల్లాడుతుంటే కొందరు పుట్టిన పిల్లలను అమానుషంగా చెత్తబుట్టలో, విధుల్లో, ముళ్ల కంపల్లో వదిలేయడం, పుట్టిన శిశువు ఆడపిల్ల ఐతే చంపేయడం, భర్తలు ఆడపిల్ల నచ్చకపోతే విడాకులు ఇవ్వడం ప్రతిరోజు సమాజంలో ఎదో ఒక వార్త వింటూనే ఉన్నాం. ఆడపిల్లలపై లైంగిక దాడులు, యాసిడ్ దాడులు అరికట్టడానికి విధిస్తున్న శిక్షలను పుట్టిన పిల్లలను వదిలేసే వారిపై కూడా అలంటి శిక్షలు విధించి సమాజంలో ఇలాంటివి పునరావృతం కాకుండా సమాజంలో మార్పు తేవడానికి అధికారులతో పాటు ప్రతి ఒక్కరు ప్రయత్నించాలని మరికొందరు కోరుతున్నారు.

video source: ANI