telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

నేడు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి నగరంలో పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు

హైదరాబాద్  నగరం లో  డెంగ్యూ ముప్పు ఉందన్న నేపథ్యంలో  నేడు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కాట నగరం నారాయణగూడ, కూకట్పల్లి, జేఎన్టీయూ, మూసాపేట్, భరత్ నగర్ రైతు బజార్ మరియు పలు ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించారు.

కమిషనర్ నారాయణగూడ క్రాస్ రోడ్ వద్ద కమిషనర్ నిర్మించిన మార్కెట్ గదులను కేటాయింపు ప్రక్రియను పూర్తి చేయాలని జోనల్ కమీషనర్ ను ఆదేశించారు.

శంకర్ మట్ వద్ద రాంకీ ఆర్ ఎఫ్ సీ వెహికిల్ డ్రైవర్ తో కమిషనర్ మాట్లాడి చెత్త తరలింపు వివరాలు అడిగి తెలుసుకున్నారు.

వీధుల్లో పరిశుభ్రమైన వాతావరం ఉండేలా చెత్తను తొలగించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. గార్బేజ్ వల్బరేబుల్ పాయింట్ తొలగింపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశించారు.

కమిషనర్ వెంట శానిటేషన్ అడిషనల్ కమిషనర్ రవి కిరణ్ పాల్గొన్నారు.

ఖైరతాబాద్, ఎల్బీనగర్, సికింద్రాబాద్ జోనల్ పరిధిలో పలు ప్రాంతాల్లో శానిటేషన్ పై జోనల్ కమిషనర్ లు అనురాగ్ జయంతి, హేమంత్ కేశవ్ పాటిల్ రవి కిరణ్ ఆకస్మికంగా తనిఖీ చేసి పలు సూచనలు చేశారు.

Related posts