telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“బొమ్మరిల్లు” హిందీ రీమేక్… 13 ఏళ్ల తరువాత విడుదల…!

It's my life

టాలీవుడ్ లో భారీ ప్రేక్షాదరణ పొందిన “బొమ్మరిల్లు” సినిమాని 2007లో బాలీవుడ్ లోకి రీమేక్ చేశారు. బోనీకపూర్‌ నిర్మాతగా అన్నీస్‌ బజ్మి దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. హర్మన్‌ బవేజా, జెనీలియా జంటగా నటించారు. ప్రకాష్ రాజ్ చేసిన పాత్రనునానా పటేకర్‌ పోషించారు. అయితే వివిధ కారణాల వలన వాయిదా పడింది. అయితే 13 ఏళ్ల తర్వాత ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాని నవంబర్ 29న జీ సినిమాలో నేరుగా ప్రసారం చేయనున్నారు. ఈ విషయాన్ని నిర్మాత బోని కపూర్ వెల్లడించారు. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు విశేషమైన స్పందన వస్తోంది.

కాగా సిద్దార్థ్, జెనిలియా హీరోహీరోయిన్ లుగా వచ్చిన “బొమ్మరిల్లు” చిత్రం ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. కొడుకు గురించి అతిగా పట్టించుకునే తండ్రి, తండ్రి వైపు ప్రేమ, కోపం మధ్య నలిగే కొడుకు పడే ఘర్షణ నేపధ్యంలో కథ నడుస్తోంది.. 2006 లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయ్యింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది.

Related posts