telugu navyamedia
సినిమా వార్తలు

“బిగ్ బాస్”పై గీతా మాధురి కామెంట్స్

Geetha-Madhuri

బిగ్ బాస్ మూడో సీజన్ తెలుగు బుల్లితెర అభిమానులను అలరించడానికి సిద్ధం అయ్యింది. నాగార్జున ఈ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తుండగా… కంటెస్టెంట్లుగా పలువురి పేర్లు విన్పిస్తున్నాయి. ఇంతకుముందు బిగ్ బాస్ సీజన్-1 ఎలాంటి విమర్శలు లేకుండా సరదాగా సాగిపోయింది. కానీ బిగ్ బాస్ సీజన్ 2 మాత్రం వివాదాలు, విమర్శలతో సాగింది. కౌశల్ తో మిగిలిన ఇంటి సభ్యుల గొడవలు ఒకరిపై మరొకరు ద్వేషాలు పెంచుకునే వరకూ వెళ్లింది. త్వరలో బిగ్ బాస్-3 స్టార్ట్ కానుండగా… సింగర్ గీతామాధురి సోషల్ మీడియాలోచేసిన పోస్ట్ ఆసక్తికరంగా మారింది. చాలా మంది షోకి సంబంధించిన విషయాలు అడుగుతున్నారని, షోలో పోటీదారుల ప్రవర్తనను చూసి వారిని జడ్జ్ చేయకూడదని గీతామాధురి చెప్పింది. షోలో గేమ్ స్ట్రాటజీలు ఉంటాయని, షోలో వారు ఎదుర్కొనే పరిస్థితులను బట్టి ప్రవర్తన మారుతుంటుందని చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ 2 షో ముగిసి ఏడాది కాలం గడిచిపోయిందని, షోలో ఉన్నట్లుగా రియల్ లైఫ్ లో ఎవరూ కఠినంగా లేరని.. బయట అందరూ స్నేహపూర్వకంగా ఉంటారని, బిగ్ బాస్ షోలో జరిగిన కొన్ని వివాదాస్పద విషయాలను పట్టుకొని లాగడం కరెక్ట్ కాదని, షోలో కొన్ని సందర్భాల్లో కొట్టుకున్నప్పటికీ అదంతా షో కోసం మాత్రమేనని, షో నుండి బయటకి వచ్చిన తరువాత తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని, త్వరలోనే బిగ్ బాస్ 3 కూడా మొదలుకాబోతుందని.. ఇప్పుడు గొడవల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని తెలిపింది.

Related posts