telugu navyamedia
రాజకీయ

ఉగ్రవాదులను భారత్‌కు అప్పగించు..ఇమ్రాన్ కు గవాస్కర్ సూచన!

Pak people attack pak poilet
పుల్వామా దాడులకు పాల్పడిన ఉగ్రవాదులను భారత్‌కు అప్పగించుమని పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కీలక సూచనలు చేశాడు. ఒకప్పుడు క్రికెట్ ఫీల్డ్‌లో ఇమ్రాన్కు  గవాస్కర్ మంచి స్నేహితుడు. ఇప్పుడా స్నేహం ఇచ్చిన చొరవతోనే ఇమ్రాన్‌కు పలు సూచనలు చేశాడు. ఇండియా ఒక అడుగు వేస్తే.. పాక్ రెండు అడుగులు వేస్తుంది అన్నావు కదా.. ఆ స్నేహపూర్వక అడుగులేదో ముందు నువ్వే వెయ్యి.. తర్వాత ఇండియా ఎన్ని అడుగులు వేస్తుందో చూడు అని ఇమ్రాన్‌ను గవాస్కర్ కోరాడు. 
 దాడులకు పాల్పడిన ఉగ్రవాదులను భారత్‌కు అప్పగించు.. సీమాంతర ఉగ్రవాదాన్ని ఆపెయ్.. చొరబాట్లను కట్టడి చెయ్.. అప్పుడు భారత్ ఎన్ని అడుగులు వేస్తుందో చూడు అంటూ ఇమ్రాన్‌కు చెప్పాడు. పాక్ ప్రధాని అయిన తర్వాత ఇమ్రాన్‌ను తాను కలవలేదని అన్నాడు. తాను చెప్పింది కనీసం ఇమ్రాన్ వింటాడా లేదా కూడా తనకు తెలియదని, ఒకవేళ వింటే మాత్రం అతని సమాధానం కోసం ఎదురు చూస్తానని సన్నీ స్పష్టం చేశాడు. 
ఒకప్పుడు క్రికెట్ నుంచి రిటైరవుతానని తాను చెబితే ఇమ్రాన్ వద్దన్నాడని, అప్పుడు అతని మాట తాను విన్నానని, ఇప్పుడు తన మాట ఇమ్రాన్ వినాలని లిటిల్ మాస్టర్ చెప్పాడు. ఇమ్రాన్ ఇలా స్నేహ పూర్వక అడుగులు వేసినప్పుడే అది నయా పాకిస్థాన్ అవుతుందని గవాస్కర్ వ్యాఖ్యానించారు. 

Related posts