telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

ఇంట్లోనే గంజాయి పెంచుకుంటూ.. సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ .. కళాశాలలో మత్తు మహిమే..

ganjayi farming in an apartment by

సినిమాలలో చూపించిన మాదిరి నేడు దాదాపు చాలా కళాశాలలో(పాఠశాలలలో కూడా) మాదకద్రవ్యాలు విద్యార్థులను పెడదోవ పట్టిస్తున్నాయి. దీనితో అటు చదువు, ఇటు బ్రతుకు దెరువు లేకుండా రెంటికి చెడ్డ రేవడిగా తయారవుతున్నారు. అయినా అధికారులు సొంత లాభం కోసం చర్యలు తీసుకోకుండా చూసి చూడనట్టే వ్యవహరిస్తుండటంతో పాఠశాలలు, కళాశాలలు అని తేడా లేకుండా మాదకద్రవ్యాల మాఫియా రెచ్చిపోతుంది. మాదకద్రవ్యాలకు అలవాటుపడిన యువత పెడద్రోవలు పట్టి నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా డ్రగ్స్, మత్తు పదార్థాలకు అలవాటు పడిని ఎంబీఏ విద్యార్థి విదేశాల నుంచి విత్తనాలు తెప్పించి ఇంటిలోనే గంజాయి మొక్కలు పెంచాడు. అమ్మ ఇంట్లో ఇడ్లీలు చేస్తుంటే కొడుకు మాత్రం గొడ మీద గంజాయి మొక్కలు పెంచాడు. హైటెక్ గంజాయి మొక్కలు పెంచుతూ మత్తులో ఎంజాయ్ చేస్తున్న కాలేజ్ విద్యార్థి భాగోతం గురించి తెలుసుకున్న పోలీసులు షాక్ కు గురైనారు. విద్యార్థి నివాసం ఉంటున్న బెంగళూరు నగరంలోని అపార్ట్ మెంట్ మీద దాడి చేసిన పోలీసులు హైటెక్ గంజాయి పెంపకం గురించి తెలుసుకోవడంతో వారి దిమ్మతిరిగిపోయింది.

బెంగళూరు నగరంలోని కంగేరిలోని ఓ విలాసవంతమైన అపార్ట్ మెంట్ లో అమృత్ రుషి అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. అమృత్ రుషి ప్రసిద్ది చెందిన కాలేజ్ లో బీబీఎం విద్యాభ్యాసం చేస్తున్నాడు. కుటుంబ సభ్యుల దగ్గర ప్రతిరోజూ భారీ మొత్తంలో డబ్బులు తీసుకుంటున్న అమృత్ రుషి బయట స్నేహితులు, సాటి విద్యార్థులతో కలిసి విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు. స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తున్న అమృత్ రుషి ఓ సారి గంజాయి సేవించాడు. రానురాను ఇతను గంజాయికి బానిస అయ్యాడు. తరువాత ఎంత కాలం మనం వేరే వాళ్ల దగ్గర గంజాయి కొనుగోలు చేస్తామని, మనమే గంజాయి మొక్కలు పెంచుకుంటే ఓపనైపోతుందని అమృత్ రుషి డిసైడ్ అయ్యాడు. బయట గార్డెన్ లో కాకుండా ఇంట్లోనే గంజాయి మొక్కలు పెంచాలని నిర్ణయించాడు. నెదర్లాండ్స్, ఆఫ్రికా దేశాల్లో హైటెక్ గంజాయి విత్తనాలు ఉన్నాయనే విషయం అమృత్ రుషికి తెలిసింది. ఒక్క గంజాయి గింజ రూ. 4 వేలు అని తెలుసుకున్న అమృత్ రుషి వాటిని గుట్టుచప్పుడు కాకుండా బెంగళూరు తెప్పించాలని నిర్ణయించాడు. డార్క్ వెబ్ సహాయంతో విదేశాల్లో ఆ విత్తనాలు విక్రయించే వారితో అమృత్ రుషి సంప్రధించాడు. ఒక్క గంజాయి గింజ రూ. 4 వేలు చెల్లించి కొనుగోలు చేశాడు

నెదర్లాండ్స్, ఆఫ్రికా దేశాల నుంచి గంజాయి గింజలను అమెజాన్ ప్యాక్ లో బెంగళూరుకు తెప్పించిన అమృత్ రుషి సొంత అపార్ట్ మెంట్ లో పూల కుండీల్లో పెట్టి మొక్కలుగా పెంచాడు. ఇంటిలో పెరుగుతున్న గంజయి మొక్కలను గంజాయిగా తయారు చేసుకుని ఎంజాయ్ చేశాడు. పోలీసులకు ఈ సమాచారం అందింది. అపార్ట్ మెంట్ మీద దాడి చేసిన బెంగళూరు సీసీబీ పోలీసులకు దిమ్మతిరిగిపోయింది. హైటెక్ టెక్నాలజీతో అమృత్ రుషి గంజాయి మొక్కలు పెంచుతున్నాడని నిర్ణారించుకుని అతన్ని అరెస్టు చేశారు. అమృత్ రుషి నుంచి ఎల్ఎస్ డీ డ్రగ్, క్యానాబిల్ డ్రగ్, మూడు విలువైన మొబైల్ ఫోన్లు, బైక్ స్వాధీనం చేసుకున్నామని పోలీసులు అన్నారు. అమృత్ రుషి ఇచ్చిన సమాచారంతో తుమకూరులో గంజాయి విక్రయిస్తున్న మరో వ్యక్తిని అరెస్టు చేశామని పోలీసులు అన్నారు. ఇటీవల కాలంలో డార్క్ వెబ్ ద్వారా విదేశాల నుంచి హైటెక్ మాదకద్రవ్యాలు బెంగళూరుకు తెప్పించే వారి సంఖ్య ఎక్కువ అయ్యిందని, వారి మీద నిఘా వేశామని బెంగళూరు సీసీబీ పోలీసులు తెలిపారు.

Related posts