ganjay gangs target students

విద్యార్థులే లక్ష్యంగా గంజాయి దందా…?

29

విజయవాడలో గంజాయి గ్యాంగ్ లు రెచ్చిపోతున్నాయి. కాలేజ్ విద్యార్థులే లక్ష్యంగా గంజాయి అమ్మకాలు సాగిస్తున్నారు. మార్చవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దందా జోరుగా సాగుతుంది. ఐటిఐ కాలేజ్ ఆవరణలో గుట్టుచప్పుడు కాకుండా ఈ దందా జరుగుతున్నట్లు పోలీస్ కమిషనర్ గౌతమ్ సావాన్గ్ కు ఒక ఎన్నారై కంప్లైంట్ చేశారు.

ganjay gangs target students

ఈ గ్యాంగ్ లు 13 నుంచి 15 ఏళ్ల విద్యార్థులను కూడా వదలి పెట్టకుండా గంజాయి అమ్మకాలు చేస్తున్నాయి అని కంప్లైంట్ లో పేర్కొన్నారు. టీనేజర్ల వస్తువులను స్థానిక గ్యాంగ్ సభ్యులు లాక్కుని ఇబ్బంది పెట్టారని పోలీసులకు తెలపడంతో గ్యాంగ్ లను పిలిపించి, వస్తువులను వెనక్కి ఇప్పించేశారని తెలిపారు. స్థానిక గంజాయి గ్యాంగ్ లకు ఆరుమిల్లి రామకృష్ణ అనే వ్యక్తి అండగా నిలిచాడని ఎన్నారై తన కంప్లైంట్ లో ఆరోపించారు.

ganjay gangs target students

పోలీసులు స్పందించినప్పటికీ సమస్య ఇంకా పరిష్కారం కాలేదని గంజాయి గ్యాంగ్ లు స్థానికులని వేధిస్తున్నారని ఎన్నారై కమిషనర్ కు ఫిర్యాదు చేసారు. వీధి గ్యాంగ్ లు గంజాయి అమ్ముతూ, వద్దన్న వారిని కత్తులతో, బ్లేడ్ లతో బెదిరిస్తున్నారంటూ, ఇదంతా మార్చవరం పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగుతుందని అన్నారు. గ్యాంగ్ సభ్యుల ఫోన్ నంబర్లతో సహా కంప్లైంట్ ఇచ్చాడు సదరు ఎన్నారై. అంతేకాదు వీలైనంత తొందరగా ఆ గంజాయి సమస్యను పరిష్కరించాలని కోరారు.