telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

స్పృహలోనే గంగూలీ..మరో 48 గంటలు ఆసుపత్రిలోనే !

బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ ఆస్పత్రిలో చేరారు.. ఇవాళ ఉదయం కోల్‌కతాలోని తన ఇంట్లోని వ్యాయామం చేస్తుండగా చాతీలో నొప్పి రావడంతో విలవిల్లాడిపోయారు దాదా.. దాంతో.. హుటాహుటిన గంగూలీని ఉడ్‌ల్యాండ్స్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. సౌరవ్‌కు గుండెపోటు వచ్చినట్టుగా వైద్యులు నిర్ధారించారు. ఈ వార్త ఒక్కసారి గా గంగూలీ ఫ్యాన్స్‌ను, క్రికెట్ ప్రేమికులను, క్రీడాభిమానులకు షాక్‌కు గురిచేసింది.. దాదా త్వరగా కోలుకోవాలి అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.. అయితే.. తాజాగా ఆయన ఆరోగ్యంపై బులిటెన్‌ను ఉడ్‌ల్యాండ్స్ ఆస్పత్రి వైద్యులు రిలీజ్‌ చేశారు.  “సౌరవ్ గంగూలీ యాంజియోప్లాస్టీ చేయించుకున్నారు. ఆయన ఆరోగ్యం ఇప్పుడు స్థిరంగా ఉంది. అతన్ని మరో 24 గంటలు పర్యవేక్షిస్తాం. గంగూలీ పూర్తిగా స్పృహలో ఉన్నాడు. ఆయన గుండెలో రెండు హోల్స్‌ ఉన్నాయి, దీనికి ఆయన చికిత్స పొందుతున్నారు. మరో 48 గంటలు ఆయనకు చికిత్స అవసరం” అని వైద్యులు బులిటెన్‌లో పేర్కొన్నారు. ఇది ఇలా ఉండగా… పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ కూడా సౌరవ్‌ గంగూలీ ఆరోగ్యంపై స్పందించారు. గంగూలీకి గుండెపోటు వచ్చిందన్న వార్త తనను చాలా కలిచి వేసిందని.. ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతున్ని కోరుతున్నానని ఆమె పేర్కొన్నారు.

Related posts