telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

బీజేపీలో టీడీపీ విలీనం చెందిందన్నది వట్టిదే: గల్లా జయదేవ్

galla jayadev got new responsibilities

పార్టీల విలీనాన్ని ఆమోదించే అధికారం రాజ్యసభ చైర్మన్ కు లేదని టీడీపీ గుంటూరు లోక్ సభ సభ్యుడు గల్లా జయదేవ్ ట్విటర్ లో స్పష్టం చేశారు.టీడీపీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేశ్, గరికపాటి మోహన్ రావు, టీజీ వెంకటేశ్ టీడీపీని వీడి బీజేపీ లో చేరిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం పై గల్లా జయదేవ్ ఘాటుగా స్పందించారు.

రెండు పార్టీల మధ్య విలీన ప్రక్రియకు ఆమోదముద్ర వేసే అధికారం రాజ్యసభ చైర్మన్ కు లేదని తేల్చిచెప్పరు. రాజకీయ పక్షాల విలీనం అనేది వ్యవస్థాపరమైన స్థాయిలోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. పెద్దల సభలో బీజేపీలో టీడీపీ విలీనం చెందిందన్నది వట్టిదేనని వివరించారు. షెడ్యూల్ 10, పేరా 4(2) అనేది అనర్హత, పార్టీల విలీనానంతర ప్రక్రియలకు సంబంధించింది మాత్రమేనని గల్లా ట్విటర్ లో పేర్కొన్నారు.

Related posts