G7 countries meeting help in Canada

ట్రంప్ తీరుపై మండిపడ్డ జీ7 దేశాలు…

45

జీ 7 శిఖరాగ్ర సమావేశం, ప్రపంచ ప్రధాన దేశాల మధ్య యుద్దానికి తెరతీసేవిధంగా మారనుంది, ఉత్తర అమెరికాకు చెందిన కెనడా ప్రొవిన్స్ క్యూబెక్ లోని లా మాల్బై మున్సిపాలిటీ నగరంలో ఈ సమావేశం ప్రారంభం కానుంది. జీ7 కూటమిలో ప్రపంచ సభ్య దేశాలైన అమెరికా, కెనడా, బ్రిటన్, జపాన్, జర్మనీ, ఇటలీ మరియు ఫ్రాన్స్ పాల్గొననున్నాయి. గత కొద్ధి కాలంగా అమెరికా అధ్యక్షుడు తమ దేశాలపై వ్యవహరిస్తున్న తీరు, ట్రంప్ ప్రభుత్వం విధిస్తున్న సుంకాలపై మెజారిటీ దేశాలు తీవ్రంగా మండి పడుతున్నాయి. ఫ్రాన్స్, కెనడా లాంటి దేశాలు ఇప్పటికే ట్రాంప్ ప్రభుత్వంపై బహిరంగంగా ట్వీట్ చేశాయి.

ఇన్నాళ్లు తమ దేశ సంపదను దోచుకున్న యూరో దేశాలపై ధ్వజమెత్తిన ట్రాంప్ పై, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రోన్ ట్రంప్ విధానాలపై ఘాటుగా స్పందిస్తూ పద్ధతి మార్చుకోకపోతే అమెరికాను కాదని మిగిలిన ఆరు దేశాలు సంయుక్తంగా ఉంటామని తెలపాలని సూచించారు. దీనితో కెనడా అధ్యక్షుడు జస్టిన్ ట్రుడే కూడా ట్రంప్ వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తపరిచాడు, కానీ జపాన్ మాత్రం ఎటూ మొగ్గకుండా తటస్థంగా నిలుస్తుంది.

అమెరికా ప్రభుత్వం కెనడా రైతులను మోసం చేసిందని ఆరోపించారు. పరిస్థితులను అంచనా వేస్తూ బ్రిటన్ మధ్యవర్తిగా ఉండనుందని సమాచారం, ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో యూరో దేశాలు కలిసి కట్టుగా ఉండాలని, దేశాలపై విమర్శలు, ఘర్షణలు సరికాదని థెరిసా మే తెలిపారు. ఇదే నేపథ్యంలో జీ7 దేశాల సంయుక్త ప్రకటన కోసం ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.

జీ7 దేశాల ద్వారా అమెరికా సంయుక్త రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ట్రంప్ సంబాషించనున్నాడు. సమావేశం అనంతరం ట్రంప్ సింగపూర్ వెళ్లనున్నారని ట్వీట్ చేశారు.