ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా చీమకుర్తిలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్న కార్యక్రమంలో సరదా సన్నివేశం చోటుచేసుకుంది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, బూచేపల్లి సుబ్బారెడ్డి విగ్రహావిష్కరణ తర్వాత నిర్వహించిన సభలో ముఖ్యమంత్రితోపాటు ప్రజాప్రతినిధులు, వైకాపా నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ప్రసంగ సమయంలో.. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరైన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.
అనంతరం ఆమె మహానేత వైఎస్ వైఎస్ రాజశేఖరెడ్డి పై పాట అందుకున్నారు.ఆమె పాట పాడుతుండగానే జగన్ ఇక చాలు ఆపి వచ్చేయమని సైగలు చేశారు. కానీ వెంకాయమ్మ ఇదేమీ పట్టించుకోకుండా పాట ను ఆమె కొనసాగిస్తూనే ఉన్నారు.
వెంటనే తన స్థానం నుంచి లేచి వచ్చిన జగన్, వెంకాయమ్మను వెంటపెట్టి తీసుకొచ్చి తన పక్కన కూర్చోబెట్టుకున్నారు.. ఈ పరిణామంతో సభలో నవ్వులు విరిశాయి.
టీడీపీ ఓడిపోవడానికి పవనే కారణం: సుమన్