Narendhra Modi

“మోడీని టార్గెట్ చేసిన మావోయిస్టులను …!” రాజ్ నాథ్

19

ప్రధాని నరేంద్ర మోడీని అంతమొందించడాని మావోయిస్టులు ప్రణాళిక రచిస్తున్నారని ఓ లేఖ బయటపడిన విషయం ఇప్పుడు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నది .
ఇందుకోసం గత కొన్నాళ్లుగా మావోయిస్టులు తగిన డబ్బు సమకూర్చుకుంటున్నారని తెలిసి కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయ్యింది . ఈ లేఖ దొరికింది కాబట్టి పెను ప్రమాదం తప్పిందని , లేకపోతే ఊహిస్తేనే భయమేస్తుందని కీలక నాయకులూ అంటున్నారు .
దేశంలో అరాచకం సృష్టిస్తున్న మావోయిస్టులను అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ఏరిపారేస్తున్నాయి . మావోయిస్టుల ఉనికికే ప్రమాదం వాటిల్లుతుందని గ్రహించిన వారు తమ ఉనికి కోసం భారీ స్కెచ్ వేసినట్టు తెలుస్తుంది . ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ భద్రత విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉన్నామని , బలగాలను కూడా జాగ్రత్తగా ఉండమని హెచ్చరించామని హోమ్ మంత్రి రాజనాథ్ సింగ్ తెలిపారు .
రాజీవ్ గాంధీని హత మార్చినట్టే ప్రధాని నరేంద్ర మోడీని కూడా హత్య చేస్తామని వచ్చిన వార్తల గురించి రాజనాథ్ సింగ్ స్పందించారు . ప్రస్తతం రాజనాథ్ కాశ్మీర్ పర్యటనలో వున్నారు. పూణే పోలీసులు ఈ కుట్రను బయట పెట్టిన తరువాత ప్రధాని భద్రత మరింత కట్టు దిట్టం చేశామని ఆయన చెప్పారు .
మావోయిస్టుల గురించి మాట్లాడుతూ గతంలో వారు 135 జిల్లాల్లో క్రియాశీలకంగా ఉండేవారని , ప్రస్తతం 90 జిల్లాలకే పరిమితమయ్యారని ,అందులోను కేవలం పది జిల్లాలలోని తమ ఉనికి చాటుకుంటున్నారని రాజనాథ్ తెలిపారు . హింసాకు పాలపడుతున్న మావోయిస్టుల కార్యకలాపాలు త్వరలోనే అణిచివేస్తామని ఆయన చెప్పారు . .