సంచార జాతులు, అనాథలైన నిరుద్యోగ యువతీయువకులకు వృత్తి శిక్షణ, వృత్తి నైపుణ్యతపై ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా వెనకుబడిన తరగతుల అభివృద్ధి అధికారి హెచ్.వెంకటేశ్వరి తెలిపారు. ఇందుక కోసం అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
మొబైల్ రిపేర్, ఏసీ, ప్రీడ్జ్ రిపేర్, ప్లంబింగ్, ఎంఎస్ ఆఫీస్, టాలీ, యువతుల కోసం ప్రత్యేకంగా మాడ్రన్ టైలరింగ్, మగ్గం వర్క్, ఎంఎస్ ఆఫీస్, టాలీకోర్స్‌లతో ఉచితంగా శిక్షణ ఇస్తున్నమని చెప్పారు. శిక్షణ కాలంలో వసతి, భోజన సదుపాయం ఉంటుందని తెలిపారు. ఆసక్తి గల సంచార జాతులు, అనాధలైన యువతీయువకులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాల కోసం కలెక్టరేట్‌లోని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి కార్యాలయంలో కులం, ఆధార్‌కార్డుతో సంప్రదించాలని కోరారు.