telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్

అవయవ దానం చేస్తే.. జీవితాంతం కుటుంబానికి ఉచిత వైద్యం.. !

free medication promise on organ donation

కార్పోరేట్ హాస్పిటల్ లో డాక్టర్స్ చేస్తున్న అరాచకం ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కష్టం అనుకోని హాస్పిటల్ కి వెళ్ళే వారినిరకరకాల టెస్ట్ లు పేరు చెప్పి నిలువుదోపిడీ చేసేస్తున్నారు. ఇక విషాదంలో ఉన్న కుటుంబాలని అయితే ఇదే అవకాశం అనే విధంగా టార్గెట్ పెట్టి ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారు. ఓ విధంగా హాస్పిటల్ లో మెడికల్ దందా దారుణంగా సామాన్య ప్రజలని భయపెడుతుంది అని చెప్పాలి. ఇప్పుడుఏపీలో ఓ సంఘటన కార్పోరేట్ మెడికల్ దందాని మరో సారి బయట పెట్టింది. భర్త బ్రెయిన్ డెడ్ అయి ఆసుపత్రి బెడ్‌పై అచేతనంగా పడి, భార్య బిల్లు కట్టే పరిస్థితిలో ఉన్నారు, అప్పటికే హాస్పిటల్ బిల్లు లక్ష వేసింది. బిల్లు కట్టలేనంటే ఆయన కళ్లు , కిడ్నీలు , గుండె ఆస్పత్రికి దానం చేయమని హాస్పిటల్ యాజమాన్యం వారికి చెప్పింది. తప్పని సరి పరిస్థితిలో ఆ హాస్పిటల్ నుంచి బయటపడేందుకు బ్రెయిన్ డెడ్ అయిన భర్త కళ్ళు, కిడ్ని, గుండె దానం చేసి బాధిత కుటుంబం హాస్పిటల్ బిల్లు నుంచి బయట పడింది. నెల్లూరు జిల్లాలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఏవివరాలలోకి వెళితే, కొల్లు శ్రీనివాసులు అనే వ్యక్తి నెల్లూరు జిల్లా అల్లూరు మండలంలోని వడ్డెపుగుంట వద్ద రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. బైక్‌తో ఢీకొట్టిన వ్యక్తి వెంటనే అతడిని దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. ముందు చికిత్స కోసం 20 వేలు కట్టి జాయిన్ చేశారు. విషయం తెలుసుకున్న భార్య హుటాహుటిన ఆసుపత్రికి వచ్చింది. వైద్యులు ఆమెతో నీ భర్తకు బ్రెయిన్ డెడ్ అయింది. ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని సూచించారు. అయినా బ్రతుకుతాడన్న భరోసా ఇవ్వలేమని చెప్పారు. అయితే ఇప్పటి వరకు అయినబిల్లు లక్ష రూపాయలు చెల్లించమన్నారు. దానికి ఆమె తన వద్ద అంత డబ్బు లేదని చెప్పింది. వైద్యులు అలా చెప్పిన మధ్యాహ్నానికే శ్రీనివాసులు మరణించాడని బాడీని తీసుకొని వెళ్ళాలంటే లక్ష కట్టాలని సూచించారు. ఒక వేళ లక్ష కట్టలేకపోతే రెండు కళ్లు , రెండు కిడ్నీలు , గుండె.. ఈ అవయవాలను దానం చేస్తే బిల్లు కట్టాల్సిన పని లేదని, ఇంకా మీ కుటుంబం అంతటికీ భవిష్యత్తులో ఉచితంగా వైద్యం అందిస్తామని ఆఫర్ కూడా ఇచ్చారు. ఇంతకు ముందు కట్టిన 20 వేలు కూడా ఇచ్చేస్తామన్నారు. అందుకోసం ఏవో పేపర్లు తీసుకొచ్చి వాటి మీద సంతకాలు పెట్టించుకుని బ్రెయిన్ డెడ్ అయిన పేషెంట్ అవయవాలు అన్ని అప్పనంగా తీసేసుకున్నారు. ఇప్పుడు ఈ ఘటన అక్కడ సంచలనంగా మారింది.

Related posts