telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

వైఎస్సార్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు

వైఎస్సార్సీపీ కీలక నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పోలీసులు పలు సెక్షన్ల కింద అరెస్టు చేశారు. BNS సెక్షన్ 140(1), 308, 351(3), రెడ్ విత్ 3 (5) కింద కేసులు నమోదు చేశారు. అలాగే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టారు.

వంశీని హైదరాబాద్ రాయదుర్గంలోని ఓ అపార్టుమెంట్లో అరెస్టు చేసి విజయవాడ తరలిస్తున్న ఏపీ పోలీసులు అతని ఇంటికి నోటీసులు అంటించారు. వంశీ అరెస్టులో ఏపీ పోలీసులు రాయదుర్గం పోలీసుల సహాయం తీసుకున్నారు.

కాగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గత 7నెలలుగా పోలీసులకు చిక్కకుండా అజ్ఙాతంలోకి వెళ్లిపోయారు. అతని కోసం దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఎట్టకేవలకు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు.

హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలిస్తున్నారు. వైఎస్సార్సీపీ పాలనలో వంశీ గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన కేసులో నిందితుడిగా ఉన్నారు. అయితే ఈ కేసులో అరెస్టు కాకుండా కోర్టు నుంచి ముందస్తు బెయిల్ తీసుకున్నారు. అయితే గురువారం హైదరాబాద్, రాయదుర్గం పోలీసుల సహకారంతో ఏపీ పోలీసులు వంశీని అదుపులోకి తీసుకున్నారు.

ప్రస్తుత ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిపై వంశీ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు టీడీపీ నేతలు ఆయనపై కేసులు నమోదు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

ఈనేపథ్యంలో పోలీసులు వంశీ కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. ఎట్టకేలకు ఆయన్ని హైదరాబాద్లో అరెస్ట్ చేసి విజయవాడకు తరలిస్తున్నారు.

Related posts