ఏపీలో వైసీపీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు రాజీనామా బాట పడుతున్నారు.
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు రాజీనామా చేసిన 48 గంటల్లో మరో మాజీ ఎమ్మెల్యే పార్టీకి గుడ్బై చెప్పారు.
ఏలూరు జిల్లాకు చెందిన మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) వైసీపీకి రాజీనామా చేశారు.
వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.
ఏలూరు జిల్లా అధ్యక్ష పదవితో పాటు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ కు కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ మేరకు పార్టీ అధినేత వైఎస్ జగన్కు రాజీనామా లేఖను పంపించారు.
జగన్ మంత్రివర్గంలో ఆళ్ల నాని వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా, డిప్యూటీ సీఎంగా పనిచేశారు.
జగన్ గారూ మీరు ఏపీకి సీఎం.. సాక్షి పేపర్ చదవడం మానేయండి?: నారా లోకేశ్