telugu navyamedia
క్రీడలు వార్తలు

టీ20 ప్రపంచకప్ గెలిచే అవకాశం ఉన్న జట్లలో తమ చోటివ్వని పాక్ బౌలర్

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు టీ20 ప్రపంచకప్ 2021 ను తరలించాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు. ఈ టోర్నీ ఆరంభమయ్యే సమయానికి దేశంలో సానుకూల పరిస్థితులు ఉంటే.. ఇక్కడే ఆడే అవకాశాలను కూడా కొట్టిపారేయలేం. ఐసీసీ నిర్వహించే మెగా టోర్నీ కావడం వల్ల టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌పైనే అభిమానులు ఫోకస్ పెట్టారు. ఈ సారి టైటిల్‌ను ఎవరు ఎగరేసుకెళ్లొచ్చనే డిబేట్ కూడా సాగుతోంది. దీనిపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సల్మాన్ బట్.. ఓ లిస్ట్ ప్రిపేర్ చేశాడు. టాప్-5 జట్లను ఇందులో చేర్చాడు. ఇందులో ట్విస్ట్ ఏమిటంటే- తన సొంత దేశం పేరును ఫేవరెట్స్ లిస్ట్‌లో చేర్చలేదా మాజీ డాషింగ్ ఓపెనర్. తన జాబితాలో టీమిండియాకు టాప్ ప్రయారిటీ ఇచ్చాడు. ఆస్ట్రేలియా జట్టును చివరి స్థానంలో నిలిపాడు. భారత్, ఇంగ్లాండ్, వెస్టిండీస్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాలు ఈ సారి టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నట్లు చెప్పాడు. ఈ సారి విజేతగా ఆవిర్భవించే అవకాశాలు భారత్‌కే అధికంగా ఉన్నాయని తేల్చేశాడతను. 2019 ప్రపంచకప్ సెమీ ఫైనల్‌లో దురదృష్టం వెంటాడటం వల్లే టీమిండియా ఓడిందని చెప్పుకొచ్చాడు. ఈ సారి ఆ పరిస్థితి ఉండబోదని అన్నాడు.

Related posts