telugu navyamedia
ఆంధ్ర వార్తలు

శ్రీకాకుళం జిల్లాలోని ఎలుగుబంటి ఆపరేషన్ సక్సెస్ : మ‌త్తు ఇంజ‌క్ష‌న్ ఇచ్చి బంధించిన అధికారులు

*శ్రీకాకుళం జిల్లాలోని ఎలుగుబంటి ఆపరేషన్ సక్సెస్..
*ఎట్ట‌కేల‌కు ఎలుగుబంటిని బంధించిన అధికారులు..
*మ‌త్తు ఇంజ‌క్ష‌న్ ఇచ్చిన అరగంట త‌రువాత బంధించిన సిబ్బంది..

శ్రీకాకుళం జిల్లాలోని ఎలుగుబంటి ఆపరేషన్ సక్సెస్ అయ్యింది.. వజ్ర‌పుకొత్తూరు మండ‌లం కిడిసింగి గ్రామ ప్ర‌జ‌ల‌కు హడలెత్తిస్తున్నఎలుగుబంటిని ఆట‌వీశాఖా అధికారులు ఈ రోజు బంధించారు. మూడు రోజులుగా స్థానికులకు ఎలుగు బంటి కంటి మీద కునుకు లేకుండా చేసింది. .

కిడిసింగి గ్రామంలోని రేకుల షెడ్ లో దూరిన ఎలుగు బంటికి మంగళవారం నాడు రెస్క్యూ సిబ్బంది  చాకచక్యంగా వ్యవహరించి  మత్తు ఇంజక్షన్ ఇచ్చారు. ఎవరినీ కరవకుండా దాని మూతిని గట్టిగా కట్టేసి అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. అరగంట పాటు ఎలుగుబంటిని పరీక్షించిన ఆ తర్వాత ఎలుగుబంటిని విశాఖ జూకు త‌ర‌లించారు.

Related posts