forecast of nizamabad urban 2019 election2

నిజామాబాద్ అర్బన్లో ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి ?

38

బీజేపీ లో యెండల లక్మీ నారాయణ, ధర్మపురి అరవింద్ పాత్ర ఎలా ఉండబోతుంది ?

2009 పునర్విభజన తరువాత ఏర్పడింది నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం ఓటర్లు 2,41,562 మంది, ఈ నియోజకవర్గం లో బీసీ, మైనార్టీల ప్రభావం ఎక్కువ. వీరు ఏ పార్టీ వైపు మొగ్గు చూపితే ఆ పార్టీ కి గెలుపు అవకాశాలు ఎక్కువ. 2009 ఎన్నికల్లో బీజేపీ నుండి యెండల లక్ష్మి నారాయణ గెలిచారు, తరువాత 2010 ఉపఎన్నికల్లో ను యెండల లక్ష్మి నారాయణ గెలిచారు. ఈ రెండు సార్లు ఆయన అప్పటి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డి.శ్రీనివాస్ ఫై గెలుపొందారు. తరువాత 2014 ఎన్నికలలో తెరాస అభ్యర్థి బిగాల గణేష్ గుప్తా తన సమీప అభ్యర్థి మీర్ మజాజ్ అలీ షైక్ (ఎఐఎంఐఎం) ఫై దాదాపు 10,000 పై చిలుకు ఓట్ల మెజారిటీ తో గెలుపోందారు.

బిగాల గణేష్ గుప్తా వివాదాలకు దూరంగా ఉంటారు వ్యక్తిగతం గా మంచి పేరుంది. కానీ అనుచరుల ఆగడాల వల్ల అది కాస్తా దెబ్బతింటుంది, నిజామాబాద్ లో జరిగే ప్రతివిషయంలో ఆయన తలదూర్చడం వల్ల ఎమ్మెల్యే కు స్థానిక మేయర్ కు గ్యాప్ పెరిగిందని అందరూ అనుకుంటున్నారు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 9 నియోజకవర్గాలు ఉంటే అందులో నిజామాబాద్ అర్బన్ లో తెరాస చాలా వెనుకబడి ఉంది, ముఖ్య మంత్రి చేసిన సర్వేల్లోనూ బిగాల గణేష్ గుప్తా వెనకబడి ఉన్నారు. దీనికి కారణం ఆయన ఉంటే హైదరాబాద్ లో లేకపోతె విదేశాల్లో ఉంటారని పలువురు చెబుతున్నారు. నియోజకవర్గ ప్రజలకు దూరంగా ఉండడం తో ఈయన ఫై ప్రజల్లో కొంత అసంతృప్తి ఉంది, గెలిచినా ఏడాదిన్నరలో నిజామాబాద్ ని క్లీన్ అండ్ గ్రీన్ గా మారుస్తానని హామీలు కురిపించారు గణేష్ గుప్తా కానీ కాంగ్రెస్ హయాంలో ప్రారంభమైన పైప్ లైన్ పూర్తి కాలేదు అని ఆరోపణ, నాణ్యతలేని రోడ్లు వేశారని ప్రజలు అంటున్నారు. ఇచ్చిన హామీలు ఏవి పూర్తి కాలేదు. దీనితో గణేష్ గుప్త భవితవ్యం ఎలా ఉంటుందో చూడాలి.

ఈ నియోజకవర్గంలో లో ఇంచు మించు అన్ని పార్టీలు బలంగా ఉన్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మహేష్ కుమార్ గౌడ్ నిలవగా, బీజేపీ నుండి సూర్యనారాయణ ధన్పాల్ పోటీ చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని వ్యూహాలు రచిస్తున్నారు మహేష్ కుమార్ గౌడ్, గతం లో మహేష్ కుమార్ గౌడ్ గిడ్డంగుల శాఖ ఛైర్మెన్ గ కూడా చేశారు.

forecast of nizamabad urban 2019 election2

ఇక నిజామాబాద్ బీజేపీ లో ధర్మపురి శ్రీనివాస్ తనయుడు బీజేపీ లోకి రావడం తో బీజేపీ కి కొంత బలం పెరిగింది. ఆయన బీజేపీ నుండి ప్రజాసమస్యలపై పోరాటం చేస్తున్నారు, అలాగే అరవింద్ ఫౌండేషన్ ద్వారా కుడా సామజిక సేవ చేస్తున్నారు. ఇదే నియోజకవర్గంలో బీజేపీ జాతీయ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే యెండల లష్మినారాయణ కూడా స్థానికంగా ఉంటూ సమస్యలపై పోరాడుతున్నారు. కాకపోతే వీరిద్దరిమద్య విభేదాలు రావడంతో ఎవరిదివారే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గడిచిన ఎన్నికల్లో యెండల లక్ష్మి నారాయణ ఎంపీ గా పోటీ చేసి ఓడిపోయారు, ధర్మపురి అరవింద్ కూడా వచ్చే ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ నుండి పోటీ చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. అన్ని నియోజిక వర్గాల్లో ని గ్రామాలో ప్లెక్సీ లు వేయించారు. అందులో యెండల ఫోటో లేకపోవడంతో విబేధాలు ప్రారంభమైయ్యాయని పార్టీ నాయకులు అంటున్నారు. అయితే నిజమాద్ అర్బన్ నుండి వీరిలో ఎవరు పోటీ చేస్తారు, పార్లిమెంట్ కి ఎవరు పోటీ చేస్తారని అందరు ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు.

వీరిద్దరి మధ్య విబేధాలు సమసిపోతే నిజామాబాదు అర్బన్ నియోజిక వర్గంలో బీజేపీ జెండా ఎగరవచ్చునని విశ్లేషకులు అంటున్నారు.

-సంతోష్ కుమార్