5 రాష్ట్రాల అసెంబ్లీఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపుర్ ఫలితాలు సాయంత్రానికి వెలువడనున్నాయి.
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతు అయ్యింది. ముఖ్యంగా పంజాబ్ నుంచి అవమానకర రీతిలో ఓటమి పాలైంది.సిద్ధూ నాయకత్వంపై పెట్టుకున్న నమ్మకం, చన్నీ సామాజిక వర్గ ఆదరణ.. రెండూ అంచనాలు ఘోరంగా విఫలం అయ్యాయి.
దీంతోపంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ త్వరలో పంజాబ్ గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్‌తో సమావేశమై తన రాజీనామాను సమర్పించే అవకాశం ఉందని ఆ ఆపార్టీ వర్గాలు తెలిపాయి. గురువారం ఉదయం చండీగఢ్‌లోని తన అధికారిక నివాసానికి సీఎం చన్నీ వచ్చారు.
పంజాబ్‌లో ఓట్ల లెక్కింపు జరుగుతున్న తరుణంలో కూడా ఈ పరిణామం చోటు చేసుకుంది. చమ్‌కౌర్ సాహిబ్ , బదౌర్ నుండి పోటీ చేసిన రెండు నియోజకవర్గాల నుండి చరణ్‌జిత్ సింగ్ చన్నీ వెనుకంజలో ఉన్నారు.
వైఎస్ఆర్ కమీషన్ల వల్ల ప్రాజెక్టు పనులు ఆగిపోయాయి: దేవినేని ఉమ