telugu navyamedia
సినిమా వార్తలు

సరికొత్త లుక్ లో ఆకట్టుకుంటున్న అక్షయ్ కుమార్

Akshay-Kumar

సాజిద్ న‌డియావాలా నిర్మాణంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ “బ‌చ్చ‌న్ పాండే” అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఫ‌ర్హాద్ సంజీ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు చిత్రబృందం. ఇందులో అక్ష‌య్ కుమార్ నుదుటిపై విబూది, మెడలో రుద్రాక్షలు, నల్లని పంచె కట్టుకుని అయ్య‌ప్ప వేష‌ధార‌ణ‌లో ఉన్నాడు అక్షయ్. ఇంక‌ చేతిలో మార్షల్ ఆర్ట్స్ ఆయధమైన నాన్ చాక్ ఉండటం ఆసక్తిని కలిగిస్తోంది. మాస్ మ‌సాలా ఎంట‌ర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉంటుంద‌ని తెలుస్తుంది. “రౌడీ రాథోర్” చిత్రం మాదిరిగానే ఈ చిత్రం ఉండ‌బోతుంద‌ని బాలీవుడ్ మీడియా చెబుతుంది. గ‌తంలో అక్ష‌య్ కుమార్, ఫ‌ర్హాద్ క‌లిసి కోలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం “వీర‌మ్‌”ని రీమేక్ చేయాల‌నుకున్నారు. కాని ప‌లు కార‌ణాల వ‌ల‌న ఆ ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్క‌లేదు. కాని “బచ్చ‌న్ పాండే” చిత్రంతో వీరిరివురు ప్రేక్ష‌కుల‌ని అల‌రించేందుకు సిద్ధ‌మ‌య్యారు. 2020 క్రిస్మ‌స్ కానుక‌గా ఈ చిత్రాన్ని విడుదల చేయ‌నున్నారు. ఇక అక్ష‌య్ న‌టించిన “మిష‌న్ మంగ‌ళ్” చిత్రం ఆగ‌స్ట్ 15న విడుద‌ల కానుంది. ప్రముఖ శాస్త్రవేత్త రాకేష్‌ ధావన్‌ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. అక్షయ్ ప్ర‌స్తుతం మిష‌న్ మంగ‌ళ్‌, గుడ్ న్యూస్‌, సూర్య‌వంశీ, ల‌క్ష్మీ బాంబ్ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాడు.

Related posts