telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

రిబ్బన్ కట్ చేయడానికి తంటాలు పడ్డ ట్రంప్ భార్య…!

Trump

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భార్య మెలినియా ట్రంప్ రిబ్బన్ కట్ చేయడానికి ఎంతగానో కష్టపడ్డారు. వాషింగ్టన్ డీసీలో అమెరికా మొదటి అధ్యక్షుడైన జార్జ్ వాషింగ్టన్‌కు నివాళిగా గతంలోపెద్ద స్థూపాన్ని ఏర్పాటు చేశారు. ఎలివేటర్, సెక్యూరిటీ సిస్టమ్ రెనొవేషన్‌ కోసమని మూడేళ్ల క్రితం ఈ స్థూపాన్ని మూసివేశారు. ఆ పనులు పూర్తికాగా శుక్రవారం స్థూపాన్ని తిరిగి ప్రారంభించేందుకు అమెరికా ప్రథమ మహిళ మెలినియా ట్రంప్ హాజరయ్యారు. అయితే మెలినియా చేతికిచ్చిన కత్తెర సైజు చాలా పెద్దది అవడం మూలానో ఏమో కాని ఆమె ఎంతగా ప్రయత్నించినప్పటికీ.. రిబ్బన్ కట్ అవలేదు. ఆమెకు ఇరువైపుల ఉన్న వారు ఈలోగా రిబ్బన్‌ను కట్ చేసేయడంతో చివరకు.. ఆమె రిబ్బన్ కట్ చేయకుండానే స్థూపాన్ని సందర్శించాల్చి వచ్చింది. కాగా, ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో సైతం ట్రెండ్ అయింది.

Related posts