fire sezing between talibans and afghanistanies

ఆఫ్ఘనిస్తాన్, తాలిబన్ల మధ్య కాల్పుల విరమణ…

44

ఆఫ్ఘనిస్తాన్ మరియు తాలిబన్ల మధ్య రంజాన్ సందర్భంగా కాల్పుల విరమణ ఒప్పందం ఏర్పడింది. మొదటిసారిగా తాలిబన్లు దాదాపుగా 17 ఏళ్ళ తరువాత కాల్పుల విరమణకు ఒప్పుకున్నారు. ఈ మేరకు ఆఫ్ఘనిస్తాన్ లో శాంతి నెలకొల్పేందుకు మేము సహాయపడతామని పాకిస్తాన్ చెప్పడం ఈ సందర్భానికి కొసమెరుపనే చెప్పాలి.

ఆఫ్ఘనిస్తాన్ మరియు తాలిబన్ల మధ్య రంజాన్ ను పురస్కరించుకొని కాల్పుల విరమణ గురించి విదేశీవ్యవహారాల అధికారిఆ` ఒకరు మీడియాతో తెలిపారు. మరో పక్క పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ తో శాంతి ఒప్పందానికి అంగీకరించిన విషయం తెలిసిందే.

యూఎస్ ఫారిన్ సెక్రటరీ మైక్ పొంపియో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖ్అమర్ జావేద్ బజ్వా తో ఆఫ్ఘనిస్తాన్ విషయమై చర్చించి ఇరు దేశాలమధ్య శాంతి ఒప్పందం ఏర్పడటానికి తోడ్పడ్డారు.