telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

కరోనా ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. ఐదుగురు సజీవ దహనం

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. అటు జనాలు.. సెకండ్ వేవ్ దాటికి పిట్టల్లా రాలిపోతున్నారు. అయితే తాజాగా కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 30 లక్షలు దాటేసింది. ఇటు కరోనా కోరలు చాస్తుంటే..  అటు ఛత్తీస్ ఘడ్ విషాదం చోటుచేసుంది. రాయపూర్ పచ్పెడీనాకా పరిధిలోని రాజధాని ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 5 రోగులు దహనం అయ్యారు. ఐసియూలోని ఫ్యాన్ లో షార్ట్ సర్క్యూట్ జరిగిన కారణంగా చెలరేగిన మంటలు.. ఆస్పత్రిలోని కరోనా రోగుల వార్డ్ కు వ్యాపించింది. దీనితో అక్కడి రోగులు పరుగులు పెట్టారు. అటు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. మంటలు అదుపులోకి వచ్చిన అనంతరం పరిశీలించగా 5 మంది రోగులు మరణించినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ ప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తున్నట్లు స్థానిక ఎస్పీ పేర్కొన్నారు. ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఛత్తీస్ ఘడ్ సీఎం…మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. అంతేకాదు మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు ఛత్తీస్ ఘడ్ సీఎం.

Related posts