telugu navyamedia
తెలంగాణ వార్తలు

సికింద్రాబాద్‌ క్లబ్‌లో భారీ అగ్ని ప్రమాదం..

హైదరాబాద్ లోని సికింద్రాబాద్‌ క్లబ్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం తెల్లవారుజూమున 3 గంటల సమయంలో సికింద్రాబాద్ క్లబ్‌లో భారీ ఎత్తును మంటలు ఎగిసిప‌డ‌డంతో క్లబ్‌ మొత్తం మంటలు వ్యాపించి.. క్లబ్ మొత్తం తగలబడిపోయింది.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని ..సూమారు 10 ఫైర్‌ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. క్లబ్‌లో అగ్నిప్రమాదం సంభవించడంతో సుమారు రూ. 20 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం. భారీగా మంటలు ఎగసిపడటంతో సమీప ప్రాంతాల్లో ఉన్నవారు భయాందోళనకు గురయ్యారు.

జూబ్లీ బస్ బస్టాండ్ దగ్గరగా ఉండటంతో అటుగా వాహనాల రాకపోకలు పోలీసులు నిషేధించించారు. ఈ ప్రమాదం తెల్లవారుజామున జరగటంతో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

బ్రిటీష్‌ హయాంలో క్లబ్‌ నిర్మాణం..

1879లో బ్రిటీష్‌ హయాంలో మిలిటరీ అధికారుల కోసం ఈ క్లబ్‌ నిర్మాణం చేశారు. దాదాపు 20 ఎకరాల విస్తీర్ణంలో సికింద్రాబాద్‌ క్లబ్ నిర్మించ‌బ‌డింది. భారతీయ వారసత్వ సంపదగా 2017లో గుర్తించి పోస్టల్‌ కవర్‌ విడుదల చేశారు. సికింద్రాబాద్‌ క్లబ్‌లో 300 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. అంతేకాకుండా సికింద్రాబాద్‌ క్లబ్‌లో 5వేల మందికి పైగా సభ్యత్వం ఉంది. సంక్రాంతి కావడంతో శనివారం క్లబ్‌ను ముసివేసినట్లు తెలుస్తోంది.

Related posts