telugu navyamedia
సాంకేతిక

స్మార్ట్‌ఫోన్‌ అతి వినియోగం..చేతి వేళ్లకు ప్రమాదం!

Micromax released the first smartphone in the series
నిరంతరం స్మార్ట్‌ఫోన్‌ వినియోగించడంతో మెదడుతో పాటు దేహంలోని వివిధ భాగాలపై తీవ్రప్రభావం చూపుతుందని ఇటీవల వైద్యులు, శాస్త్రవేత్తలు వెల్లడించిన సంగతి తెలిసిందే. స్మార్ట్‌ఫోన్‌ ఉంది కదా అని ఇష్టానుసారం వినియోగిస్తే భవిష్యత్‌లో ఇబ్బందులు తప్పవు. నిరంతరం స్మార్ట్‌ఫోన్‌ వినియోగిస్తే చేతి వేళ్లకు ప్రమాదమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని ఓ పరీక్ష  కేంద్రంలో  విద్యార్థులు పరీక్షలు రాస్తున్న సమయంలో చేతిలో నుంచి పెన్ను జారిపోయే కేసులు సంఖ్య పెరిగింది. 
 కొందరు విద్యార్థులు చేతి వేళ్ల సమస్యతో హాస్మట్, వివిధ ఆస్పత్రులకు వెళ్లి చికిత్స చేయించుకున్నారు. హస్మట్‌ ఆస్పత్రిలో ప్రతి నెల ఐదు నుంచి ఆరు కేసులు వస్తున్నాయని ఆస్పత్రి నిర్వాహకులు తెలిపారు. అతిగా స్మార్ట్‌ఫోన్లు వినియోగించడం వల్ల పెన్ను పట్టుకోవడానికి సహాయపడే బొటనవేలు, ఇతరవేళ్లకు శక్తి దశలవారీగా తగ్గిపోతుంది. నిరంతరం మూడు గంటలు పరీక్ష రాయడం సాధ్యం కావడం లేదు. చేతివేళ్లకు వాపు రావడంతో దీనిని స్మార్ట్‌ఫోన్‌ దంబ్‌ అని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.

Related posts