telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ప్రైవేట్ టీచర్లకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే అకౌంటులో డబ్బులు

కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేయడంతో ఇబ్బందులు ఎదుర్కుంటున్న ప్రైవేట్ టీచర్లను, సిబ్బందిని ఆదుకోవడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. విద్యాసంస్థల ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి నెలకు రూ. 2000 నగదు సాయంతో పాటు కుటుంబానికి 25 కేజీల బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా సరఫరా చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులను స్వీకరించిన విద్యాశాఖ అధికారులు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తిచేశారు. అయితే ప్రభుత్వమందించే ఈ ఆపత్కాలపు ఆసరాకు లబ్ధిదారుల ఎంపిక పూర్తయింది. మొత్తం 1,18,004 మందిని సాయం కోసం ఎంపికచేశారు. వీరిలో 1,06,383 మంది టీచర్లు, 11,621 మంది బోధనేతర సిబ్బంది ఉన్నారు. ఈ సంఖ్య మరో 10వేల వరకు పెరిగే అవకాశమున్నట్టు అధికారులు అంచనావేస్తున్నారు. ఎంపికైన వారికి మంగళవారం అంటే రేపటి నుంచి నుంచి రూ. 2వేల నగదు సాయం అకౌంట్లలో జమ చేయనుండగా.. 21వ తేదీ నుంచి 25 కేజీల బియ్యం పంపిణీ చేయనున్నారు. ఈ నగదు సాయం కోసం ఇప్పటికే విద్యాశాఖ రూ.32 కోట్లు మంజూరుచేయగా, పౌరసరఫరాలశాఖ 3.625 టన్నుల సన్న బియ్యాన్ని సిద్ధంచేసింది. 

Related posts