నేటి నుండి సాకర్ సంబరాలు…

116

ఫుట్ బాల్ ప్రపంచ కప్ సాకర్ కు రష్యా సిద్ధం. తొలిసారిగా ఈ ప్రపంచ కప్ సాకర్ కి రష్యా వేదిక కానుంది. మనకు క్రికెట్ అంటే ఎంత పిచ్చో యూరప్ దేశాల వాళ్లకి సాకర్ అంటే అంత పిచ్చి. ఫుట్ బాల్ వరల్డ్ కప్ టోర్నీ కి రష్యాలోని 11 నగరాల్లోని 12 స్టేడియాలు సిద్ధమైయ్యాయి. ఈ ప్రపంచ కప్ కి ప్రపంచ వ్యాప్తంగా 32 దేశాలు అర్హత సాదించాయి. కాగా 210 దేశాలు ఈ ఫిఫా టోర్నీ కి పోటీ పడగా కేవలం 32 మాత్రమే అర్హత పొందాయి.

USA v Portugal: Group G - 2014 FIFA World Cup Brazil

జూన్ 14 నుండి జులై 14 వరకు సాకర్ మ్యాచ్ లు జరుగనున్నాయి. నాలుగేసి జట్లు 8 గ్రూపులుగా విడిపోయి తలపడనున్నాయి. వరల్డ్ కప్ లో బ్రెజిల్, జర్మనీ జట్లు ఫాబ్రిక్ గా రంగంలోకి దిగనున్నాయి, అర్జంటీనా, స్పెయిన్ కూడా చాలా ఫామ్ లో ఉన్నాయి. ఆరంభ మ్యాచ్ లో రష్యా సౌదీ అరేబియా తో తలపడనుంది, గట్టి ప్రత్యర్థి గా ఏటా ముందుండే ఇటలీ ఈ సారి భాగం కాలేక పోయింది. లారెన్ కొసెల్లి, డుమిట్రిక్ పెయిన్, జర్కియోరోమేరో ఈ సారి ఆడటం లేదు. ఈజిప్ట్ జట్టు ఇప్పటి వరకు 27 సార్లు పాల్గొంది. ఉరుగ్వే ఇప్పటికి 2 సార్లు ప్రపంచ కప్ గెలిచింది.

ప్రపంచ దేశాల నుండి ఫిఫా అభిమానులు రష్యాకు చేరుకుంటున్నారు. దాదాపు 85 వేల కోట్లను రష్యా ఫిఫాకు ఖర్చు చేస్తుంది.