live-kiss

ఫిఫా వరల్డ్ కప్…పందెం కోసమే అలా చేశాను…క్షమించండి…

145

రష్యాలో జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ క్రీడలను లైవ్ రిపోర్ట్ చేస్తున్న కొలంబియా మహిళా జర్నలిస్టును ఒక అజ్ఞాత వ్యక్తి ముద్దుపెట్టుకున్న విషయం అందరికి తెలిసిందే. అయితే లైవ్ ప్రచారం అనంతరం అతని కోసం వెతకగా ఎక్కడా కనిపించలేదు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో ఆగ్రహించిన మహిళా జర్నలిస్ట్ జూలియెత్ గోంజాలెజ్ థెరాన్ సామజిక మాధ్యమంలో ఎవరు పెట్టారో అన్నట్లుగా ఒక పోస్ట్ ను పెట్టింది. 

అయితే ఆ పోస్ట్ ను చూసిన అజ్ఞాతకుడు తానొక రష్యాకు చెందిన ఫుట్ బాల్ ఆటలా ప్రేమికుడని, అయితే తన స్నేహితులు ఎవరైనా టీవీ రిపోర్టర్ లైవ్ లో ఉన్నపుడు ఆమె బుగ్గమీద ముద్దు పెట్టుకోవాలని పందెం కాయడంతో ఆలా చేశానని తాను చేసిన పనికి క్షమాపణలు కోరుకున్నాడు.

source :dw.com