telugu navyamedia
రాశి ఫలాలు

ఫిబ్రవరి 16, బుధవారం రాశిఫలాలు

మేషరాశి..

ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ధనం ఎక్కువ‌గా ఖ‌ర్చు అవుతుంది. కుటుంబసభ్యులతో తగాదాలు ఏర్ప‌డ‌తాయి. దైవదర్శనాలు చేస్తారు. వ్యాపారాల్లో చికాకులు త‌ప్ప‌వు. ఉద్యోగ‌స్తుల‌కు స్థాన మార్పిడి ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ఆరోగ్య భంగం క‌లుగుతుంది.

వృషభరాశి..

త‌ల‌పెట్టిన ప‌నులు సజావుగా పూర్తి చేస్తారు. సంఘంలో ఆదరణ ల‌భిస్తుంది. పరిచయాలు పెరుగుతాయి.విందువినోదాల్లో పాల్గొంటారు. శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. అనవసర వివాదాల్లో తలదూర్చకండి. బంధువుల వల్ల కొంత ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. వ్యాపారాలు మంద‌గిస్తాయి. ఉద్యోగ‌స్తుల‌కు అనుకూలంగా ఉంటుంది.

మిథునరాశి..

సన్నిహితులు, మిత్రులతో కలహాలు ఏర్ప‌డ‌తాయి. తోటి వారిత శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. అనారోగ్యం సూచ‌న‌. కుటుంబంలో ఒత్తిడులు ఏర్ప‌డ‌తాయి. వ్యాపారాలు గందరగోళంగా ఉంటాయి.ఇనుము వ్యాపారులు లాభపడతారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు.

కర్కాటకరాశి..

నిరోద్యోగుల‌కు ఉద్యోగాలు దక్కుతాయి. శుభవార్తలు వింటారు, ఇంటాబయటా అనుకూలంగా ఉంటుంది. కొత్త విషయాలు తెలుస్తాయి.ఆర్థిక స్థితి బలపడుతుంది. తెలియని వ్యక్తుల వల్ల మీరు గందరగోళానికి గురవుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

సింహరాశి..

తొందరపాటు నిర్ణయాల వల్ల మాటపడవలసి వస్తుంది. బంధువులతో విరోధాలు ఏర్ప‌డ‌తాయి. కష్టపడ్డా ఫలితం కనిపించదు. అన్న‌ద‌మ్ములు మ‌ధ్య‌ ఆస్తులపై వివాదాలు నెల‌కొంటాయి. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని కలిగిస్తుంది. అనారోగ్యం బారిన ప‌డ‌తారు. వ్యాపారాలు అంత‌గా క‌లిసిరావు.

కన్యరాశి..

అనుకోని ప్రయాణాలు చేస్తారు. నూతన పరిచయాలు ఏర్ప‌డ‌తాయి. సేవాకార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయులతో సఖ్యత ఏర్ప‌డ‌తాయి. విందువినోదాలు పాల్గొంటారు. వ్యాపారులు లాభాలు గడిస్తారు. విద్యార్థులు శ్రమించవలసి ఉంటుంది. ఉద్యోగులకు ఉన్నత హోదాలు ద‌క్కుతాయి.

తులరాశి..

ఆహారం విషయంలో ఆజాగ్రత్తగా ఉండకండి.. అనారోగ్యం పాల‌వుతారు. ఆహ్వానాలు అందుకుంటారు. ఉద్యోగ‌స్తులు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో సమస్యలు ఎదుర‌వుతాయి.ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

వృశ్చికరాశి..

రోజంతా చికాకుగా ఉంటారు. మిత్రులతో మాటపట్టింపులు వ‌స్తాయి. అనుకోని ఖర్చులు చేస్తారు. బాధ్యతలు అధికమవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడతారు. వ్యాపారాలు మంద‌కొడిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త వివాదాలు త‌లెత్తుతాయి.

ధనుస్సురాశి..

నిరుద్యోగులకు ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయి. ఆధ్యాత్మిక ప్రదేశ సందర్శనకు వెళతారు. సంతోషంగా ఉంటారు. కుటుంబసమస్యలు చికాకు పరుస్తాయి. దూరప్రయాణాలు చేస్తారు. వ్యాపారాలు అంత‌గా క‌లిసిరావు. ఉద్యోగ‌స్తుల‌కు స్థాన మార్పిడి ఉండ‌వ‌చ్చు.

మకరరాశి..

కొత్త మిత్రుల పరిచయం అవుతారు. శుభవార్త వింటారు. ఆర్థికాభివృద్ధి బాగుంటుంది. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వాహనయోగం క‌లుగుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి.

కుంభరాశి…

విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కొత్త పరిచయాలు ఏర్ప‌డ‌తాయి. అంచనాలు ఫలిస్తాయి. ఉద్యోగ‌స్తుల‌కు పై అధికారులు నుంచి ప్ర‌శంస‌లు అందుతాయి. ఆరోగ్యంపై శ్ర‌ద్ధ చూపించ‌డం మంచిది.

మీనరాశి..

సన్నిహితుల నుంచి ఒత్తిడులు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. ఆలయ దర్శనాలు చేస్తారు. నిరోద్యోగుల ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలు చిక్కులు ఏర్ప‌డ‌తాయి.బంధువులతో మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది.

Related posts